EPISODE 3: 23.02.2023 LIVE TELECAST HERE 👇👇
https://www.youtube.com/watch?v=W-rr4cnXqPk
*🌷ఫ్రమ్ ది డెస్క్ ఆప్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం, ఎపిసోడ్-3 ముఖ్యాంశాలు.*
(1) తాను పాఠశాలలను తనిఖీ చేసేటప్పుడు ఏ అంశాలను పరిశీలించేది స్పష్టంగా తెలియజేశారు.
(2) అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఉపాధ్యాయులందరూ తమ సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ పూర్తి చేసి ఉండవలెను.
(3) పూర్తి అయిన సిలబస్ ప్రకారం విద్యార్థులందరూ నోట్ బుక్స్ రాసి ఉంచవలెను.
(4) పాఠాల వారీగా విద్యార్థులు రాసిన నోట్ బుక్స్ ను ఉపాధ్యాయులు అందరూ పరిశీలించి సంతకం చేయవలెను.
(5)నోట్ బుక్స్ పరిశీలన మొక్కుబడిగా కాకుండా విద్యార్థులు రాసిన తప్పులను ఉపాధ్యాయులు సరిదిద్దవలెను.
(6) డిజిటల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి బైజూస్ ట్యాబ్స్ ను ఉపాధ్యాయులందరూ ఉపయోగించవలెను. ట్యాబ్ లోని విషయాలు, వీడియోలపై మంచి అవగాహన కలిగి ఉండవలెను.
(7) తాను అనంతపురం సత్యసాయి జిల్లాలో పాఠశాలల పరిశీలన సమయంలో అక్కడ ఉన్న డీఈవో గారికి, ఎంఈఓ గారికి బైజూస్ ట్యాబ్స్ విషయమై అవగాహన లేదన్నారు.
(8) అదే జిల్లాలో శోభారాణి అనే ఎస్ జి టి టీచర్ సిలబస్ కవరేజ్ , వర్క్ బుక్ కరెక్షన్ చాలా బాగా చేసిందని కితాబునిచ్చారు.
(9) పాఠాలు చెప్పడం, నోట్ బుక్స్ కరెక్షన్ చేయడం ఉపాధ్యాయుల దినచర్యలో భాగమని నేను పాఠశాలల తనిఖీ నందు వాటినే పరిశీలిస్తున్నానని అటువంటప్పుడు ఉపాధ్యాయులు ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నారో అర్థం కావడం లేదన్నారు.
0 Comments:
Post a Comment