Electric Cooker ఎలక్ట్రిక్ కుక్కర్ లో వండిన అన్నం నిజంగానే అనారోగ్యమా..?
మనిషి జీవన విధానంలో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. ప్రతి చోట కూడా శ్రమ తగ్గించేందుకు గాను కొత్త టెక్నాలజీని ఆవిష్కరించడం జరిగింది. టెక్నాలజీ పెరుగుతున్న ఈ సమయంలో కొత్త సమస్యలు కూడా పట్టుకుని వస్తున్నాయి. సాంకేతిక విప్లవం ప్రారంభం అయినప్పటి నుంచి జనాల్లో కొత్త తరహా జబ్బులు నమోదు అవుతున్నాయి. అలాగే ఒకప్పుడు ఉన్న జీవన విధానం ఇప్పుడు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆయుర్వేద నిపుణులు చెబుతున్న దాని ప్రకారం మనం తీసుకునే ఆహారం ను బట్టి మన జీవితం మరియు మన ఆరోగ్యం ఉంటుంది. అందుకే మనం తినే ప్రతి ముద్ద కూడా కాస్త జాగ్రత్తగా తింటే మంచిది అని నిపుణులు చెబుతున్నారు.
కరెంట్ కుక్కర్ లో తయారు చేసిన ఆహారం విషంగా మారుతుంది అంటున్నారు.
అల్యూమినియం పాత్రలో తయారు అయ్యే ఆహారం విషంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కరెంట్ కుక్కర్ లో అల్యూమినియం బౌల్ ను ఉపయోగిస్తారు. ఆ బౌల్ అనేది పూర్తిగా బయటకు కనిపించకుండా లో లోపలే అన్నం ను రెడీ చేస్తుంది. అలా చేయడం వల్ల అల్యూమినియం లోని విష పదార్థాలు ఆహారంలో చేరతాయి. అల్యూమినియం ను అత్యధికంగా వేడి చేసిన సమయంలో విషపు వాయువులు వెలువడతాయి. కనుక ఆ అన్నం కూడా విష తుల్యం అయినట్లే అంటున్నారు. ఒక సారి కనుక ఆ ఆహారం తింటే పర్వాలేదు పది ఇరవై సార్లు తిన్నా కూడా ఎక్కువ ప్రమాదం ఉండక పోవచ్చు. కానీ అదే పనిగా ఏళ్లకు ఏళ్లు తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అల్యూమినియం పాత్రలలో వండిన ఆహారం తినడం వల్ల ఎక్కువగా ఉదర సమస్యలు మరియు జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి అంటూ నిపుణులు చెబుతున్నారు.
సరిగ్గా ఉన్న జీర్ణ వ్యవస్థను ఈ అల్యూమినియం తో ఉండే ఆహార పదార్థాలు చెడగొడతాయి. జీర్ణ వ్యవస్థ కూడా సమస్యలు తలెత్తడంతో ముందు ముందు మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండెకు సంబంధించిన సమస్య మొదలుకుని పలు అనారోగ్య సమస్యలకు ఖచ్చితంగా కరెంట్ కుక్కర్ లో వండిన అన్నం అవుతుందని అంటున్నారు. కీళ్ల వాతం కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధి లేని వారు ఈ కుక్కర్ అన్నం తినడం వల్ల వెంటనే కాకున్నా భవిష్యత్తులో ఖచ్చితంగా దాని బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్యాస్ సంబంధిత సమస్యలు మొదలుకుని అధిక బరువు ఇంకా కాలేయం సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి అంటూ నిపుణులు చెబుతున్నారు. అందుకే తప్పనిసరి అయితే తప్ప ఎలక్ట్రిక్ కుక్కర్ ను వాడటకుండా ఉండటం మంచిది.
0 Comments:
Post a Comment