టర్కీ, సిరియాల్లో మరణమృదంగం కొనసాగుతోంది. భూకంప వల్ల మృతి చెందిన వారి సంఖ్య 33 వేలు దాటింది. ఇది ఐక్యరాజ్యసమితి అంచనా కంటే రెట్టింపుగా ఉంది.
ఈ ఘోర కలి నుంచి టర్కీ, సిరియాల ఇప్పట్లో బయటపడేల కనిపించడం లేదు. అయితే ఈ భూ కంప ముప్పు భారత్ కు కూడా ఉండే అవకాశలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
స్వల్ప భూకంపాలు
ఎందుకంటే భారత్ రెగ్యులర్ స్వల్ప భూకంపాలు వస్తున్నాయని వారు చెబతున్నారు. "పాకిస్తాన్‌తో సరిహద్దుకు సమీపంలో భారత్ కు పశ్చిమ వైపున ఉన్న ట్రిపుల్ జంక్షన్ సూక్ష్మ స్థాయి భూకంపాలు సంభవించడం వల్ల నిరంతరం ఒత్తిడిని విడుదల చేస్తోంది. చాలా సందర్భల్లో 4 లేదా 5 తీవ్రతతో కొన్ని భూకంపాలు కూడా వస్తున్నాయని" అని చెబుతున్నారు.
సిక్కింలో భూకంపం
సిక్కింలో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4.15 గంటలకు సిక్కింలోని యుక్సోమ్‌కు వాయువ్యంగా భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
ఆదివారం మధ్యాహ్నం అస్సాంలోని నాగోన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందేనని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
టెక్టోనిక్ ప్లేట్లు
మూడు టెక్టోనిక్ ప్లేట్లు కలిసే చోటును సంకర్షణ చెందే బిందువుగా పిలుస్తారు. ట్రిపుల్ జంక్షన్ గణనీయమైన భూకంప, అగ్నిపర్వత కార్యకలాపాలకు సంబంధించిన ప్రదేశంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్లేట్ల కదలిక భూమి క్రస్ట్‌లో ఒత్తిడి పెంచుతందని దీంతో భూ కంపాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. టిబెట్ పీఠభూమి ఎత్తును కొనసాగిస్తూ.. భారత ప్లేట్ సుమారుగా ఏడాదికి 47 మి.మీ చొప్పున కదులుతోంది. ఇది హిమాలయ, ఆల్టిన్ టాగ్, టియన్ షాన్ పర్వతాలను విచ్ఛిన్నం చేస్తుంది.
హిమాలయాల్లో భూకంపాలు
దీంతో భారత్ లో భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నట్లు వివరిస్తున్నారు. హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గతంలోనే హెచ్చరించారు.
భారత్, యురేషియన్ ప్లేట్ ల మధ్య ఘర్షణ ఫలితంగా హిమాలయాల్లో భూకంపాలు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
భారత్ లో భూ కంపలు దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారత దేశంలో ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయట.
0 Comments:
Post a Comment