మన ఆహార అలవాట్లను బట్టే జీర్ణప్రక్రియ, విసర్జన వ్యవస్థల పనితీరు ఉంటుంది.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే మలబద్ధకం రూపంలో అవస్థ తప్పదు. అందుకే కొన్ని ఆహార అలవాట్లు మార్చుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. Image from Pexels
ఉదయం అల్పాహారం చాల ఘనంగా మధ్యాహ్న భోజనం సామాన్యంగా, రాత్రి భోజనం మితంగా తీసుకోవాలి. భోజనాన్ని హడావుడిగా కాకుండా నింపాదిగా, నిదానంగా చేయాలి. దాని వల్ల బాగా లాలాజలం ఊరి, జీర్ణప్రక్రియ సాఫీగా జరుగుతుంది. Image from Pexels
అల్లం టీ: చల్లగాలికి వెచ్చటి టీ తాగుతోంటే ఆ అనుభూతే వేరు. అది ఆ క్షణం వరకే! దానికి అల్లం చేర్చుకోండి. జీర్ణప్రక్రియను వేగవంతం చేయడమే కాదు.. శరీరాన్నీ వెచ్చబరుస్తుంది. Image from Pexels
దాల్చిన చెక్క టీ : దాల్చిన చెక్కని మనం మసాలా దినుసుల్లో విరివిగా వాడతాం. దీనిని తాగడం వల్ల ఇందులోని ప్రత్యేక గుణాలు రక్తంలోని బ్లడ్ షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తాయి.
అదే విధంగా, స్కిన్ మెరిసేలా చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్న దాల్చిన క్యాన్సర్ కారకాలకు కూడా వ్యతిరేకంగా పని చేస్తుంది. వీటితో పాటు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. Image from Pexels
నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయాన్నే లేవగానే, ఒకటి, రెండు గ్లాసుల నీరు తాగండి. గోరువెచ్చగా ఉంటే మరింత మంచిది. జీర్ణ సమస్యలు, అనేక సమస్యలకు ఈ నీరు పరిష్కారం చూపిస్తుంది.
కాబట్టి ఉదయాన్నే నీరు తాగడం చాలా మంచిది. ఇలా చేయటం వల్ల మలబద్ధకం సమస్య పోతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి ఇది మంచి రెమిడీలా పనిచేస్తుంది. Image from Pexels
యాలకులతో తిన్న ఆహారం సాఫీగా జీర్ణమై శరీరానికి తగినంత జీవశక్తిని ఇస్తుంది. యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులలో ఉంది. Image from Pexels
ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు, గింజల లాంటివి తీసుకోవాలి. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు తినాలి. Image from Pexels
0 Comments:
Post a Comment