Diabetes Control Tips: మీరు ఊహించని మధుమేహాన్ని పూర్తిగా తగ్గించే అద్భుతమైన చిట్కా!
Diabetes Control Ayurvedic Tips: భారత్‌లో మధుమేహం అత్యంత వేగంగా వ్యాప్తిస్తోంది. పెద్దలేకాకుండా ఈ వ్యాధి బారిన చిన్న వయసు వారు కూడా పడుతున్నారు.
అయితే ఇలాంటి సమస్యలు రావడానికి కారణాలు చెడు జీవనశైలి పాటించడం, అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చలవిడిగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. మధుమేహం వ్యాధి వల్ల శరీరంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దీని కారణంగా చాలా మందిలో గుండెపోటుతో పాటు కిడ్నీ ఫెయిల్యూర్, స్కిన్ ఇన్ఫెక్షన్, హైబీపీ సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడా ఔషధలను వినియోగించకుండా, ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ కింది చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
అశ్వగంధ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
మధుమేహాన్ని ఎలా నియంత్రిస్తుందో తెలుసా?:
అశ్వగంధకు ఆయుర్వేద శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కెరను సులభంగా నియంత్రించి మధుమేహాన్ని తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అశ్వగంధ పొడి ప్రతి రోజూ వేడి నీటితో కలుపుకుని తీసుకుంటే సులభంగా డయాబెటిస్ నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
హైబీపీని అదుపులో ఉంటుంది:
అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు అశ్వగంధ పొడిని వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చు. ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో అశ్వగంధను తీసుకుంటే రక్తపోటు సమస్యలు సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కోపం నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పెరుగుతున్న బరువును తగ్గించడానికి సహాయపడుతుంది:
ప్రస్తుతం చాలా మంది స్థూలకాయం సమస్యలతో పోరాడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఆహారంలో అశ్వగంధను వినియోగించడం వల్ల సులభంగా ఫలితాలు పొందుతారని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే చాలా రకాల గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ దీనిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
అలసట, బలహీనత సమస్యలకు చెక్:
అలసట, బలహీనత సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ అశ్వగంధ పొడిని గ్లాసు పాలలో వేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వాతావరణం మారడం కారణంగా వచ్చే సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో మూలకాలు శరీరాన్ని దృఢంగా కూడా చేస్తాయి. అయితే తరచుగా అనారోగ్య సమస్యతో బాధపడేవారు తప్పకుండా దీనిని తీసుకోవాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment