Dangerous Man: దేశ వాణిజ్య రాజధాని ముంబైలోకి ప్రమాదకారి, కిరాతకుడు అయిన ఒక వ్యక్తి ప్రవేశించాడని, అతడి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) హెచ్చరించింది.
విదేశాల్లో శిక్షణ పొందిన సర్ఫరాజ్ మెమోన్ అనే వ్యక్తి ముంబై చేరుకున్నాడని, అతడు దేశానికి చాలా ప్రమాదం అని ఎన్ఐఏ ముంబై పోలీసులకు తెలిపింది.
ఈ మేరకు అతడికి సంబంధించిన వివరాల్ని ముంబై పోలీసులతోపాటు, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులకు కూడా మెయిల్ చేసింది.
ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్‌కు చెందిన సర్ఫరాజ్ మెమోన్ చైనా, పాకిస్తాన్, హాంకాంగ్ వంటి దేశాల్లో శిక్షణ పొందాడు. అతడు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడగలడు.
చాలా ప్రమాదకారి. అతడు ఇటీవల ముంబై చేరుకున్నాడు. అందువల్ల అతడి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులకు తెలిపింది.
అతడి ఫొటో, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఇతర వివరాల్ని పోలీసులకు అందజేసింది. వీలైనంత త్వరగా అతడిని పట్టుకోవాలని ఆదేశించింది.
ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఇటీవల ఇద్దరు ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. వీళ్లు సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఇద్దరూ అక్కడ ఆయుధ శిక్షణ తీసుకునేందుకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గరి నుంచి భారీ స్థాయిలో ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీరిచ్చిన సమాచారం ఆధారంగా సర్ఫరాజ్ మెమోన్ విషయం బయటపడింది. ఈ అంశంపై ముంబై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
0 Comments:
Post a Comment