Daggubati Suresh Babu: సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా క్రిమినల్ కేసు.. సమన్లు జారీ చేసిన కోర్టు..
టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా వివాదంలో చిక్కుకున్నారు. ఫిలిం నగర్ లాండ్ వివాదంలో కొత్త మలుపు. సురేష్ బాబు,రానా మీద క్రిమినల్ కేసు నమోదయ్యింది.
దౌర్జన్యంగా తమను రౌడీల సాయంతో ఖాళీ చేయించారు అని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు. చేశారు. ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరించారని అతడు తన ఫిర్యాదులో తెలిపారు.
ఫిర్యాదు చేసినా బంజారా హిల్స్ పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు బాదితుడు. సురేష్ బాబు, దగ్గుబాటి రానాతో సహా మరి కొంతమంది విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది కోర్టు.
ఈ వ్యవహారం పై గతంలోనూ వచ్చిన విషయం తెలిసిందే.. తాజాగా కోర్టు జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు ఇదే వార్త ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయం పై ఎలా స్పందిస్తారో చూడాలి.
0 Comments:
Post a Comment