దగ్గును వేగంగా తగ్గించే పవర్ ఫుల్ డ్రింక్ ఇది.. రోజు తాగితే మరిన్ని బెనిఫిట్స్
దగ్గు.. ప్రస్తుత వింటర్ సీజన్ లో సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి. పైగా ఇంట్లో ఒకరికి దగ్గు పట్టుకుందంటే మిగతా వారికి సులభంగా సోకుతుంది.
దగ్గు కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు. అలాగే రాత్రుళ్ళు దగ్గు వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఈ క్రమంలోనే దగ్గును వదిలించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్ ను తీసుకుంటే చాలా వేగంగా దగ్గు పరారవుతుంది. పైగా ఈ డ్రింక్ ను ప్రతిరోజు కనక తీసుకుంటే మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా మీ సొంతం అవుతాయి. మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి..?దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, పావు టేబుల్ స్పూన్ శొంఠి పొడి, చిటికెడు మిరియాల పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక తమలపాకును కూడా వేసి కనీసం పది నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి. ఈ వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ తేనెను కలిపితే మన డ్రింక్ సిద్ధమవుతుంది. రోజుకు ఒకసారి ఈ డ్రింక్ ను తీసుకుంటే అందులో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దగ్గును చాలా వేగంగా తగ్గిస్తాయి. అలాగే జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గొంతు నొప్పి వంటి సమస్యలను కూడా నివారిస్తాయి. అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి. మలబద్ధకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. జీర్ణశక్తి సైతం రెట్టింపు అవుతుంది. కాబట్టి దగ్గుతో బాధపడుతున్న వారే కాదు ఎవ్వరైనా ఈ డ్రింక్ ను తీసుకోవచ్చు. మధుమేహం ఉన్నవారు తేనె కలపకుండా ఈ డ్రింక్ ను తీసుకుంటే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
0 Comments:
Post a Comment