మొక్కుబడి బోధన వద్దు
♦️.అది విద్యార్థుల భవిష్యత్తుకు దెబ్బ.. ఆంగ్లంలో ప్రావీణ్యం సాధించాలి
♦️. టీచర్లకూ ఇంగ్లీష్ శిక్షణ ఇవ్వాలి.. విద్యాశాఖ సమీక్షలో సీఎం ఆదేశాలు
🌻అమరావతి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): సీరియ్‌సగా లేని బోధనతో ఫలితం ఉండదని, మొక్కుబడి బోధనతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్న డిజిటల్ విధానంలో బోధనపై సీరియ్‌సగా ఉండాలని టీచర్లకు సూచించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యపై గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఇవ్వబోయే విద్యా కానుక వస్తువులను పరిశీలించారు. బ్యాగులు, బూట్లు, యూనిఫాం క్లాత్, బెంచీలను చూసి పలు సూచనలు చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ విద్యా రంగంలో అమలుచేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ఉండాలన్నారు. దీనివల్ల నాణ్యత పెరుగుతుందని చెప్పారు. పాఠ్యపుస్తకాలు నాణ్యతతో ఉండాలన్నారు. 6వ తరగతి నుంచి తరగతి గదుల్లో డిజిటల్ ఐఎ్‌ఫపీ ప్యానెళ్లు ఏర్పాటుచేస్తున్నామని, కింది తరగతులకు టీవీ స్ర్కీన్లు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వడం వల్ల ఇంటి వద్ద కూడా పాఠ్యాంశాలు నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇంటర్ విద్యలోనూ డిజిటల్ విధానం తేవడంపై ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గతంలో 3, 4, 5 తరగతుల పిల్లలకు సబ్జెక్టుల వారీగా బోధన లేదని, ఇప్పుడు సబ్జెక్టు టీచర్ల బోధన జరుగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. విద్యార్థులు 6వ తరగతిలోకి వచ్చాక విద్యను మరింత సీరియ్‌సగా తీసుకోవాలని అధికారులు, టీచర్లకు సీఎం సూచించారు. వచ్చే విద్యా సంవత్సరంలోగా ఐఎ్‌ఫపీ ప్యానెళ్లు ఏర్పాటుచేయాలని, ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా విద్యార్థులు ఆంగ్లంలో ప్రావీణం సాధించేలా చూడాలని, ఇందుకోసం టోఫెల్, కేంబ్రిడ్జి సంస్థల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులతో పాటు టీచర్లకూ ఆంగ్లంపై శిక్షణ కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌ల వినియోగంలో కడప, విజయనగరం, చిత్తూరు జిల్లాలు ముందున్నాయని అధికారులు తెలుపగా, ట్యాబ్‌ల ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్న తీరు గురించి తల్లిదండ్రులకు ఫీడ్‌బ్యాడ్ అందించాలని సీఎం సూచించారు. మొదటి దశ నాడు-నేడు పనుల్లో ఎక్కడైనా లోపాలుంటే సరిదిద్దాలని సీఎం ఆదేశించారు. మూడో దశ నాడు-నేడులో 16,968 పాఠశాలలను అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు ప్రవీణ్ ప్రకాశ్, సురేశ్‌కుమార్, కాటమనేని భాస్కర్, ఎంవీ శేషగిరిబాబు, నిధి మీనా తదితరులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment