ప్రపంచంలోని 7 వింతలు.అని చిన్నప్పటి నుండి చదువుకుంటూనే ఉన్నాం.
అయితే ఈ ఏడు వింతల్లో ఒకటి బ్రెజిల్ లోని రియోలో ఉన్న" క్రీస్ట్ ది రిడీమెర్" గా పిలువబడే ఏసు క్రీస్తు విగ్రహం. 1920 నుండి 1931 లో దీని నిర్మాణం జరిగింది.
ప్రపంచంలోని అతిపెద్ద, ప్రముఖ విగ్రహాల్లో ఒకటైన బ్రెజిల్‌లోని ఏసు క్రీస్తు విగ్రహం ఈ నెల 10న పిడుగుపాటుకు గురైంది. క్రీస్ట్ ది రిడీమెర్ గా పిలిచే ఈ విగ్రహం తల భాగంలో పిడుగుపాటు సంభవించింది.
జీసస్ విగ్రహం తలను మెరుపు తాకుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.(Image : instagram@ fsbragaphotos)
మెరుపు.. విగ్రహంపై తగిలినప్పుడు దేవుడు ఏదో అతీంద్రియ శక్తిని ప్రదర్శిస్తున్నట్లుగా ఒక అభిప్రాయాన్ని కలిగించేలా అది కనిపిస్తోంది.(Image : instagram@ fsbragaphotos)
ఫెర్నాండో బ్రాగా అనే వ్యక్తి ఈ ఫోటోలను తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఎత్తయిన ప్రదేశంలో పిడుగు పడటం సహజమే కానీ సరిగ్గా ఆ సమయంలో ఫొటో తీయడం అనేది అద్భుతమని నెటిజన్లు అతడి నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు.(Image : instagram@ fsbragaphotos)
ప్రపంచంలో ఎత్తయిన క్రీస్తు విగ్రహాల్లో ఇది నాలుగో స్థానంలో ఉంది. 30 మీటర్ల ఎత్తయిన ఈ విగ్రహానికి.. 8 మీటర్ల ఎత్తయిన పీఠం దీనికి అదనం.
చేతులు చాచినట్లుగా ఉన్న ఈ విగ్రహం చేతుల వెడల్పు 28 మీటర్లు ఉంటుంది. ఏటా దాదాపు 20 లక్షల మంది ఈ విగ్రహాన్ని సందర్శిస్తుంటారు.
గతంలోనూ ఈ విగ్రహం పిడుగుపాటుకు గురైంది. 2014లో పడిన పిడుగు వల్ల విగ్రహం బొటన వేలు దెబ్బతింది.(Image : instagram@ fsbragaphotos)
0 Comments:
Post a Comment