China : ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించిన చైనాలో ఇప్పుడు దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి.
1990 నుంచి సాధించిన ఆర్థిక వృద్ధి ఇప్పుడు పూర్తిగా పడిపోయేలా ఉంది. ఎందుకంటే ఆ దేశంలో సరిపడా జనాభా లేకపోవడమే.
యంగ్ జనరేషన్ జనాభా తగ్గిపోవడంతో అక్కడ పని చేయడానికి సరిపడా యువత లేకుండా పోతోంది.
దాంతో చాలా నగరాలు, ప్రాంతాల్లో ముసలి జనాభా పెరిగి పోతోంది. ఈ క్రమంలోనే సిచువాన్ ప్రావిన్స్ వారు ఓ ప్రకటన చేశారు. తమ ప్రాంతంలో పిల్లల్ని కనేందుకు పెండ్లి అవసరం లేదంటూ ప్రకటించారు.
వాస్తవంగా చైనాలో చాలా కఠినమైన రూల్స్ ఉంటాయి. పెండ్లి చేసుకోకుండా పిల్లల్ని కంటే అలాంటి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్ లు అందవు.
రిజిస్టర్ చేయంచుకోవచ్చు..
కానీ ఇప్పుడు ప్రావిన్స్ స్థానిక ప్రభుత్వం దాన్ని బ్రేక్ చేసింది. పిల్లల్ని కనేందుకు పెండ్లి అవసరం లేదని, పిల్లల్ని కనాలనుకునే వారు సంబంధిత అధికారుల వద్ద రిజిస్టర్ చేయించుకోవచ్చు.
వారికి పెండ్లి అయిన వారి లాగే అన్ని రకాల స్కీములు, ప్రయోజనాలు వర్తిస్తాయి.
ఎంత మంది పిల్లల్ని అయినా సరే కనొచ్చు. వారికి పరిమితి లేదు. వచ్చే ఫిబ్రవరి 15 నుంచి ఈ స్కీమ్ అందుబాటులోకి వస్తుంది అంటూ తెలిపింది ప్రావిన్స్ ప్రభుత్వం.
చైనాలో ఇలాంటి కొత్త ప్రకటన రావడం ఇదే మొదటి సారి. చూస్తుంటే అక్కడ మిగిలిన పట్టణాల్లో కూడా ఇలాంటి రూల్స్ తెరమీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
0 Comments:
Post a Comment