Chhatrapati Shivaji Maharaj | మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. ఔరంగజేబు తన మేనమామ పహిస్తా ఖాన్‌ను శివాజీపై దాడికి పంపినా పరాజయంతో వెను తిరగవలసి వచ్చింది.
Chhatrapati shivaji jayanti | శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్షం నాడు పుణె జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి దంపతులకు జన్మించారు.
శివాజీకి బాల్యంలో మాతృభూమిపై, ప్రజలపైన ప్రేమ కలిగే విధంగా తల్లి విద్యాబుద్ధులు నేర్పింది. భారత, రామాయణ గాథలు చెప్పి వీరత్వం చిగురింప చేసింది.
వీరు మహారాష్ట్రలో వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి దేవగిరి మరాఠా యాదవ రాజుల వంశానికి చెందిన ఆడ పడుచు.
శివాజీ తన తండ్రి పొందిన పరాజయాలను అధ్యయనం చేసి అనతి కాలంలోనే యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. 17 ఏళ్ళ వయసులో మొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు.
మరో మూడేళ్ళలో కొండన, రాజ్‌గఢ్ కోటల ను సొంతం చేసుకొని పూణె ప్రాంతాన్నంతా స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. యుద్ధ తంత్రాల్లోనూ శివాజీ అనుసరించే విధానం శత్రువులకు అంతుబట్టని విధంగా సాగేది.
తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 2వేల మంది సైనికులను 10 వేల మందికి పెంచుకోగలిగాడు. సైనిక సంపత్తి ప్రాముఖ్యా న్ని ఆయన గుర్తించడంతోపాటు, తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శ నం.
పటిష్ఠమైన సైన్యంతోపాటు నిఘా వ్యవస్థను ఏర్పరచుకొని, ఆధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించారు. గెరి ల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు.
శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆది ల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేశాడు. తర్వాత శివాజీని, బెంగుళూరులో ఉన్న శివాజీ అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపాడు.
అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. అప్పుడు ఆదిల్షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్‌ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు.
శివాజీ బీజాపూర్‌కు చెందిన తోరణ దుర్గాన్ని స్వాధీనం చేసుకొని పూణె ప్రాంతాన్నంతా తన అధీనంలో తెచ్చుకున్నారు.
శివాజీకి మహిళల పట్ల అపారమైన గౌరవం. ఇతర రాజ్యాలపై దండెత్తినప్పుడు స్త్రీలపై ఎలాంటి దాడులకు అనుమతించే వారు కాదు. వారిని తన ఆడబిడ్డల లాగే చూసుకునేవారు. నైపుణ్యం ఉన్నవారినే సైనికులుగా స్వీకరించేవా రు.
అలాగే సైనికులకు వ్యక్తిగత ఆయుధాలను కూడా ఇవ్వడానికి నిరాకరించారు. వేరే రాజ్యాలను ఆక్రమించుకున్న సందర్భంలో దోచుకున్న ఆయుధాలకు తప్పనిసరిగా లెక్క లు చూపి, ఆయుధాగారానికి తరలించాలనే నిబంధనలు అమలు చేశారు.
అలాగే మత ప్రదేశాలపై, ఇళ్లపై దాడులకు అంగీకరించేవారు కాదు. తన స్నేహితుల్లో, సైనిక వ్యవస్థలో ఎంతోమంది ముస్లింలకు సుముచిత స్థానం కల్పించా రు. బీజాపూర్ సుల్తానులను ఓడించడానికి మొఘల్ పాలకు డు ఔరంగజేబుకు సహాయపడ్డాడు. అహ్మద్ నగర్ ముట్టడి లో కీలక పాత్ర పోషించారు.
ఓటమి తప్పనిపిస్తే, యుద్ధం నుండి తప్పుకోవాలి. అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి. ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారట. ఇదే శివాజీ పాటించే యుద్ధతంత్రం.
పటిష్ఠమైన నావికా దళం మరాఠాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దీనికి శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం. విదేశీ దండయాత్రల నుంచి రాజ్యాన్ని కాపాడుకోటానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది.
యుద్ధంలో భయంకరమైన అఫ్జల్‌ఖాన్ ముందుగానే శి వాజీ యుద్ధతంత్రాలను, గెరిల్లా యుద్ధాల గురించి తెలుసుకున్నాడట. అందుకే శివాజీని రెచ్చగొట్టేందుకు ముందుగానే శివాజీకి ఇష్టమైన భవానీ దేవాలయాన్ని కూలగొట్టాడట.
అయితే అప్జల్ కుట్రలను శివాజీ పసిగట్టి ఆయన్ని సమావేశానికి ఆహ్వానించాడు. శివాజీ ఉక్కు కవచాన్ని వేసుకుని, చేతికి పులిగోర్లు ధరించి సమావేశానికి వెళ్లారు. అక్కడ శివాజీ, అప్జల్ ఖాన్ అంగరక్షకులతో మాత్రమే హాలులోకి వెళ్లారు.
అఫ్జల్‌ఖాన్ కత్తితో పొడించేందుకు ప్రయత్నించగా, శివాజీ తన పులిగోర్లతో అతడిని హతమార్చారు. దీంతో శివాజీ మరాఠా యోధుడిగా పేరుతెచ్చుకున్నారు.
మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. ఔరంగజేబు తన మేనమామ పహిస్తా ఖాన్‌ను శివాజీపై దాడికి పంపినా పరాజయంతో వెను తిరగవలసి వచ్చింది.
1666లో ఔరంగజేబు కుట్రచేసి శివాజీని ఆగ్రాలో బంధించినపుడు చాకచక్యంగా తప్పించుకొన్నారు. 1674 నాటికి శివాజీ లక్ష సైన్యాన్ని, ఆయుధాలను, అశ్వాలను, నావికాదళాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
1674 జూన్ 6న రాయగఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి ' అని బిరుదును ప్రదానం చేసారు. కొన్నాళ్ళకు శివాజీ 50వేల బలగంతో దక్షిణ రాష్ర్టాల దండయాత్రచేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నారు.
27 ఏండ్లపాటు యుద్ధాలలో గడిపి సువిశాల మ రాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. నిరంతరంగా యుద్ధాలు చేస్తున్న సమయంలో మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి 1680 ఏప్రిల్ 3న రాయగఢ్ కోటలో మరణించారు.
0 Comments:
Post a Comment