Chat CPT డిగ్రీ కూడా పాసవ్వని చాట్ జీపీటీ ఓనర్
ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సమాచారం శరవేగంగా ఎల్లలు దాటుతోంది. ముఖ్యంగా స్మార్ట్ పోన్ల రాకతో అర చేతిలో ప్రపంచం ప్రత్యక్షమవుతోంది.
అయితే ఇప్పటివరకు మనకు ఏ సమాచారం కావాలన్నా ప్రతి ఒక్కరూ గూగూల్ మీదే ఆధారపడేవారు. కానీ తాజాగా చాట్ జీపీటీ (Chat GPT) అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సరికొత్త టెక్నాలజీ రాకతో సమాచారం క్షణాల్లో అందుతోంది. గుండు పిన్ను నుంచి రాకెట్ వరకు.. దేని గురించి సమాచారం కావాలన్నా ఈ చాట్ జీపీటీ చిటికెలో అందిస్తోంది. అందుకే ఇప్పుడు ఈ టెక్నాలజీ వినియోగంపై ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు. మిలియన్ సంఖ్యలో వినియోగదారులు ఈ యాప్ ను వాడుతున్నారు. కచ్చితమైన సింగిల్ ఆన్సర్ తో ఈ యాప్ గూగుల్ కే దడ పుట్టిస్తోంది. అయితే ఈ చాట్ జీపీటీ ఆవిష్కరణ వెనుక కనీసం డిగ్రీ కూడా పాసవ్వని వ్యక్తి ఉన్నాడంటే నమ్మశక్యం కాదు. కానీ అదే నిజం. చాట్ జీపీటీ ఆవిష్కర్త శామ్ ఆల్ట్‌మాన్ డిగ్రీ మధ్యలోనే ఆపేశాడు.
ఎవరీ శామ్ ఆల్ట్‌మాన్?
శామ్యూల్ H. ఆల్ట్‌మాన్ 1985 ఏప్రిల్ 22న చికాగోలో జన్మించాడు. అతని తల్లి చర్మవ్యాధి నిపుణురాలు. శామ్యూల్ H. ఆల్ట్‌మాన్ కి చిన్నప్పటి నుంచే కంప్యూటర్ పై ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే 8 ఏళ్ల వయసులోనే మొదటి కంప్యూటర్ ను తన తల్లిదండ్రుల నుంచి అందుకున్నాడు. కంప్యూటర్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ తో స్టాన్ పోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్యూటర్ కోర్సులో జాయిన్ అయ్యాడు. అయితే డిగ్రీ రెండేళ్లు చదివాక 19 ఏళ్ల వయసులోనే లూప్ట్ (Loopt) అనే సోషల్ నెట్ వర్కింగ్ మొబైల్ సైట్ యాప్ ను స్థాపించి దానికి సీఈవో అయ్యాడు. అయితే కొన్ని కారణాల వల్ల దాన్ని గ్రీన్ డాట్ కార్పొరేషన్ కు 43.4 మిలియన్ డాలర్లకు అమ్మేశాడు. అనంతరం 2011లో వై కాంబినేటర్ (Y Combinator)లో పార్ట్ టైం పార్ట్నర్ గా జాయిన్ అయ్యాడు. 2014లో శామ్యూల్ ను Y Combinator కు ప్రెసిడెంట్ గా నియమిస్తూ సంస్థ వ్యవస్థాపకుడు పాల్ గ్రహమ్ నిర్ణయం తీసుకున్నారు.
2015లో ఆల్ట్ మాన్ ఓపెన్ఏఐ (OpenAI) అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ కంపెనీని గ్రెగ్ బ్రోక్ హ్యామ్ తో కలిసి స్థాపించాడు. ప్రస్తుతం ఈ సంస్థకు ఆల్ట్ మాన్ సీఈవో గా వ్యవహరిస్తున్నాడు. OpenAI ద్వారా అభివృద్ధి చేసిన ఒక కృత్రిమ మేధస్సే ఈ చాట్ జీపీటీ. ఇది 30 నవంబర్ 2022న ప్రారంభించారు. చాట్ జీపీటీ మీ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఇవ్వడమే కాకుండా కంటెంట్ రైటింగ్, బిజినెస్ స్ట్రాటజీ వంటివి చేస్తోంది. చాట్ జీపీటీ అనేది టెక్నాలజీ రంగంలోని ఉద్యోగులు, ఇంజనీరింగ్, మార్కెటింగ్ విద్యార్థులు, వ్యాపార సంస్థలలో పెద్దఎత్తున చర్చజరుగు తోంది. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో చాట్ GPT గురించి తమ అనుభవాన్ని పంచుకుంటున్నారు. చాట్ GPT ప్రారంభించి రెండు నెలలే అయినా దాని వినియోగదారుల సంఖ్య 2 మిలియన్లు దాటిందంటే చాట్ జీపీటీ ని ఏ విధంగా వినియోగించుకుంటున్నారో అర్థమవుతోంది.
0 Comments:
Post a Comment