ఆచార్య చాణక్యుడు గొప్ప ఉపాధ్యాయుడు. అతని విధానాల కారణంగా సాధారణ బాల చంద్రగుప్తుడు చక్రవర్తిగా మారాడు.
చాణక్యుని విధానాలను చాలామంది నేటికీ అనుసరిస్తూ విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
దీనితో పాటు ప్రతి రంగానికి సంబంధించిన విషయాలు నీతి శాస్త్రంలో ప్రస్తావించారు. అదే సమయంలో మానవ సంబంధాలు, వ్యాపారం, విద్య, డబ్బు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు కూడా ప్రస్తావనకు కనిపిస్తాయి.
ఈ విధానాలను అనుసరించడం ద్వారా మనిషి తన జీవితాన్ని సులభతరం చేసుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి కొన్ని తప్పులను పొరపాటున కూడా చేయకూడదు.
మనిషి తాను చేసే తప్పుల కారణంగా పలు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.
అన్నింటిలో మొదటిది వంటగదిలో అంట్లపాత్రలు రాత్రి తోమకుండా అలానే వదిలివేయకూడదు.
అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు. అలాగే మనిషి అనవసరంగా డబ్బు ఖర్చు చేయకూడదు. అనవసరంగా డబ్బు ఖర్చు చేసే వారి దగ్గర లక్ష్మీ దేవి ఉండదు.
మనిషి తన సంపాదనలో కొంత భాగాన్ని ఆదా చేయాలి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. సాయంత్రం దీపాలు వెలిగించాక ఇల్లు తుడవకూడదు. అంతకుముందే ఆ పని పూర్తి చేయాలి.
దీపాలు వెలిగించాక ఇల్లు ఊడిస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుందని చాణక్య తెలిపారు. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి ఎప్పుడూ ఎవరినీ అవమానించకూడదు.
పెద్దలను, పండితులను, స్త్రీలను లేదా పేదలను అవమానించే వారిపై లక్ష్మీ ఆగ్రహం తెచ్చుకుంటుంది. అలాంటివారి దగ్గర సంపద నిలవదని చాణక్య తెలిపారు.
0 Comments:
Post a Comment