Bumper Offer: రూ. 797తో రిచార్జ్ చేస్తే సంవత్సరం అంతా ఫ్రీ.. రోజుకు 2జీబీ డేటా..
బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం అదిరిపోయే ప్లాన్ అందిస్తోంది. మిగతా టెలికాం కంపెనీలతో పోలిస్తే..
తక్కువ ధరకే ఎక్కువ కాలం వ్యాలిడిటీ, డాటా, ఎస్ఎంఎస్ సౌకర్యాలతో ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్యాక్‌ల కోసం చూస్తున్న వారికి ఈ ప్యాక్ నిజంగా అద్భుతం అని చెప్పాలి. బీఎస్ఎన్ఎల్ సంవత్సరం వ్యాలిడిటీతో ఆరు ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకురాగా, రూ. 799 నుంచి రూ. 2,999 వరకు ఉన్నాయి. ఈ ప్లాన్స్‌లో వినియోగదారులు ఫ్రీ వాయిస్ కాల్స్, ఉచిత రోజువారి ఎస్ఎంఎస్, డైలీ ఇంటర్నెట్ డాటా, ఫ్రీ రింగ్ టోన్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ దీర్ఘకాలిక ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే.. రూ. 799 ఉత్తతమైన ప్లాన్ అని చెప్పవచ్చు.
రూ. 797 రీఛార్జ్ ప్లాన్ వివరాలు..
365 రోజుల చెల్లుబాటుతో BSNL నుండి అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్. ఇందులో భాగంగా సంవత్సరం పాటు అపరిమిత వాయిస్ కాల్స్, 2GB/Day FUPతో అపరిమిత డేటా, రోజుకు 100 SMSలను అందిస్తుంది. దీంతోపాటు మిగతా ప్లాన్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఓసారి చూద్దాం.
రూ. 1,198 రీఛార్జ్ ప్లాన్..
ఈ ప్లాన్ రెండవ గ్రేస్ పీరియడ్‌లో ఉన్న ఇన్‌యాక్టివ్ కస్టమర్‌లను లక్ష్యంగా చేసుకుని తీసుకువచ్చారు. ఇందులో 300 నిమిషాల వాయిస్ కాల్‌లతో పాటు నెలకు 3GB డేటా, 30 SMSలను అందిస్తుంది. ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది.
రూ. 1,498 రీఛార్జ్ ప్లాన్..
ఇదే డేటా కోసం ప్రత్యేకమైన ప్లాన్. ఈ ప్లాన్‌లో ఏడాదంతా అపరిమితంగా డేటాను పొందుతారు. రోజుకు 2జీబీ డేటాను అపరిమితంగా ఏడాదిపాటు అందిస్తుంది.
రూ. 1,499 రీఛార్జ్ ప్లాన్..
ఈ ప్లాన్‌ను బిందాస్ బోల్ అని సంబోధిస్తారు. ఈ ప్లాన్‌లో ఒక సంవత్సరం పాటు అపరిమిత వాయిస్ కాల్స్ వస్తుంది. దాంతోపాటు నెల రోజులపాటు రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది.
రూ. 1,999 రీఛార్జ్ ప్లాన్..
ఇది సంవత్సరం పాలు వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. అలాగే, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను పంపుకోవచ్చు. వినియోగదారులు 600 జీబీ హైస్పీడ్ డేటాను పొందుతారు. ఇది పూర్తయిన తరువాత 80Kbps స్పీడ్‌తో అపరిమిత ఇంటర్నెట్ పొందవచ్చు. అపరిమితంగా రింగ్ టోన్స్ మార్చుకునే అవకాశం, EROS Now సబ్‌స్క్రిప్షన్, రెండు నెలల పాటు లోక్‌ధున్ కంటెంట్ అందిస్తుంది.
రూ. 2,399 రీఛార్జ్ ప్లాన్..
ఈ రీఛార్జ్ ప్లాన్ 365 రోజులతో పాటు అదనంగా మూడు నెలల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో రెండు నెలల పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. వినియోగదారులు రోజుకు 3GB వరకు హై-స్పీడ్ డేటాను పొందుతారు. ఆ తరువాత వేగం 40Kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్ కాంప్లిమెంటరీ PRBT సేవను కూడా అందిస్తుంది.
రూ. 2,999 రీఛార్జ్ ప్లాన్..
365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, రోజుకు 3GB డేటా, ఆ తరువాత వేగం 80Kbpsకి పడిపోతుంది.
0 Comments:
Post a Comment