Budget-2023: ఆదాయపు పన్ను పరిమితి రూ.7లక్షలకు పెంపు.. వారికి మాత్రమే అవకాశం
2023-24 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1గంటా 26నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం సాగింది. వేతన జీవులకు ఊరటనిస్తూ బడ్జెట్‌లో ప్రకటన చేశారు. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి రూ.7లక్షల వరకూ ఆదాయపు పన్నులో మినహాయింపు ఇచ్చారు.
బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు
బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఆయా లోహల ధరలు పెరగనున్నాయి. అలాగే టైర్లు, సిగరెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహన ధరలు భారీగా తగ్గనున్నాయి. వీటితో పాటు, టీవీ, మొబైల్, కిచెన్ చిమ్నీ ధరలు కూడా తగ్గుతాయి.
ముగిసిన బడ్జెట్ ప్రసంగం
2023-24 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1గంటా 26నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం సాగింది.
ఆదాయపన్ను పరిమితి రూ.7లక్షలకు పెంపు
ఉద్యోగులకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న రూ.5లక్షల ఆదాయపు పన్ను పరిమితిని రూ.7లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే, ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది.
* రూ.9లక్షల నుంచి రూ.12లక్షల వరకూ 15శాతం పన్ను
* రూ.12లక్షల నుంచి రూ.15లక్షల వరకూ 20శాతం పన్ను
* రూ.15. లక్షలకు పైబడిన వారికి 30శాతం పన్ను వర్తిస్తుంది.
సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకం పరిమితి పెంపు
సీనియర్ సిటిజన్స్‌లో పొదుపు పథకంలో భాగంగా డిపాజిట్ పరిమితి పెంచుతున్నట్లు బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుతం రూ.15లక్షల వరకూ ఉన్న పరిమితిని డబుల్ చేసి, రూ.30లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు.
మహిళల కోసం కొత్త స్కీమ్
ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయొచ్చు.
ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు కేటాయింపు
* కర్ణాటకలోని వెనుకబడ్డ ప్రాంతాలకు, అక్కడ సాగు రంగానికి రూ.5,300 కోట్లు
* దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్ట్‌లు, హెలిప్యాడ్‌ల నిర్మాణం
* 5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌ల ఏర్పాటు
* పీఎం కౌశల్ పథకం కింద 4లక్షల మందికి శిక్షణ.
* దేశంలో 50 టూరిస్ట్ స్పాట్‌ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
* దేఖో ఆప్నా దేశ్ పథకం ప్రారంభం
* స్వదేశీ ఉత్పత్తుల అమ్మకానికి దేశవ్యాప్తంగా యూనిటీ మాల్స్
లోక్‌సభలో నవ్వుల్ నవ్వుల్
పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. తుక్కు విధానం గురించి ఆమె ప్రకటన చేస్తూ పొల్యూటెడ్ వెహికల్ అనబోయి.. పొలిటికల్ అని పలికారు. దీంతో అధికార సభ్యులతో పాటు, విపక్ష సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. దీంతో ఒక్కసారిగా ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. పొరపాటును గ్రహించిన నిర్మలా సీతారామన్ సైతం నవ్వుతూ తప్పును సవరించుకుని తన ప్రసంగాన్ని కొనసాగించారు.
0 Comments:
Post a Comment