ఆహార పదార్థాలు ఏవైనా సరే ఆరోగ్యానికి ఎంతో అవసరం. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎంత తిన్నా ఎంకాదు.
కానీ కొన్ని ఆహార పదార్థాలు అతిగా తింటే అవి అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలను అతిగా తిన్నప్పుడు వాటికి విరుగుడుగా ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందడాం.
* అరటిపళ్ళు ఎక్కువగా తింటే వెంటనే నెయ్యి, పంచదార ఒక స్పూను కలుపుకొని తినండి.
* పుల్లటి పదార్థాలు లేక పళ్ళు తింటున్నప్పుడు బెల్లం కాస్త తింటే పులితేన్పులు రావు.
* ఉలవచారు తింటున్నారా? ఐతే ఉలవచారుకు నెయ్యి తిరగమూతైనా పెట్టండి. లేదా నెయ్యి చేర్చి భుజించండి. ఇలా భుజించడం వల్ల అజీర్తి కలగదు.
* పెసరపప్పు తింటున్నారా? కడుపు ఉబ్బరంగా ఉందా? వెంటనే ఉసిరి పచ్చడి తినండి. ఉపశమనంగా వుంటుంది.
* గారెలు తింటున్నారా? వెంటనే ఓ గ్లాసుడు మజ్జిగను వాడండి.
* పకోడీలు రుచిగా ఉన్నాయని. ఎక్కువగా తిన్నారా? రెండు చెంచాల ముల్లంగి రసం తీసుకోండి.
* బాదంపప్పులు రోజుకి 3-5 దాకా తినవచ్చు. అంతకంటే ఎక్కువ తింటే తల తిరిగినట్లు అవుతుంది. వెంటనే రెండు లవంగాలు చప్పరించండి. మీ బాధ తగ్గుతుంది.
* సండే స్పెషల్గా చేపలు వండారా? బాగా తిన్నారా? వెంటనే మామిడి రసం లేదా మామిడి పండుని తినండి.
* మామిడిపళ్ళు ఎక్కువగా తిన్నారా ఓ గ్లాసు పాలు త్రాగండి. విరుగుడుగా పనిచేస్తుంది.
ఆహారంతో వైద్యం భలే విచిత్రంగా ఉంది కదా !
0 Comments:
Post a Comment