📲ఏపీ ప్రజల సెల్‌ఫోన్లకు జగనన్న స్టిక్కర్లు!
అతి ప్రచారానికి పేరొందిన జగన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటింటికి జగనన్న స్టిక్కర్లతోపాటు ప్రతి మనిషి సెల్‌ఫోన్ వెనకాల కూడా ఆయన చిర్నవ్వులు చిందిస్తున్న స్టిక్కర్‌ను అతికించబోతోంది!
మా నమ్మకం నువ్వే జగన్'' అనే పదాలు, జగన్ బొమ్మ ఉన్న స్టిక్కర్లను ఇప్పటికే వలంటీర్లతో అతికిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్లకు కూడా అలాంటి చిన్నసైజు స్టిక్కర్లను అంటించాలని నిర్ణయించినట్లు సమాచారం. వైకాపా ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం పక్కాగా అమలు కావాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఎందుకిలా?
జగన్ స్టిక్కర్లను చూసినప్పుడల్లా ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి పొందిన రేషన్ బియ్యం, వాహనమిత్ర, పింఛన్లు వంటివి గుర్తొచ్చి ప్రజలు కృతజ్ఞతా భావంతో మళ్లీ వైకాపాకే ఓటు వేసేలా చూడాలన్నది ఈ స్టిక్కర్ల సారాంశం. అయితే ఇది మరీ అన్యాయంగా ఉందని, ప్రజల్లో ఆ పార్టీ అంటే నచ్చని వారు కూడా ఉంటారని, స్టిక్కర్లను వారికి అంటగట్టడం పద్ధతి కాదనే విమర్శలు వస్తున్నాయి. అయితే స్టిక్కర్లను అతికించుకోవడం ఐచ్ఛికమని, ప్రజలకు ఇష్టమైతేనే వాటిని అతికిస్తారని చెబుతున్నారు. కాకపోతే ఇక్కడో మెలిక ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. స్టిక్కర్లను అతించుకోవడానికి నిరాకరించిన వారిని గుర్తించి, వారికి సంక్షేమ పథకాలు దక్కకుండా చేసే కుట్ర కూడా దీని వెనక ఉందని చెబుతున్నారు.
0 Comments:
Post a Comment