మన దాయాదీ దేశం పాకిస్తాన్ ఒకప్పుడు భారత్ దేశంలో ఉండేదని తెలుసు. స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత ఈ రెండు దేశాలు పలు కారణాలతో విభజనకు గురయ్యాయి.
ముస్లిం, ముస్లిమేతర దేశాలుగా విడిపోయాయి. పాకిస్తాన్ ముస్లిం దేశంగా అవతరించగా.. భారత్ లౌకిక దేశంగా మారింది. దేశాల విభజన సమయంలోనే ఎక్కువ మంది హిందువులు భారత్ లోకి వచ్చేయగా.. కొంత మంది హిందువులు పాక్‌లో ఉండిపోయారు.
హిందువులు ఉంటే.. హిందూ దేవాలయాలు కూడా ఉంటాయి కదా. అటువంటి వాటిలో ఒకటి సింధ్ లోని ఉమర్ కోట్ శివాలయం. ఈ శివాలయం నిత్య పూజలు, అభిషేకాలు, శివ నామస్మరణలతో మారుమోగుతుంటుంది.
ఈ శివాలయానికి ఓ ప్రత్యేకత ఉందండోయ్. ఇది తెలుసుకునే ముందు ఈ ఆలయం విశేషాల గురించి తెలుసుకుందాం. సింధ్‌లోని ఉమర్ కోట్ గా పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్ కోట్ అనేవారు.
కాల క్రమంలో ఆ పేరు రూపాంతరం చెంది ఉమర్ కోట్ గా స్థిర పడింది. మొగల్ చక్రవర్తి అమర్ కోట్‌లోనే జన్మించారు. ఈ ఉమర్ కోట్ లో 80 శాతం మంది హిందువులే ఉండటం విశేషం. కొన్ని పురాణాల ప్రకారం .. ఇప్పుడు శివలింగం ప్రాంతం ఒకప్పుడు పచ్చిక మైదానాలు ఉండేవట.
అక్కడికి పశువులను మేపేందుకు ఈ ప్రాంతానికి కాపరులు తీసుకువెళ్లేవారట. కొన్ని ఆవులు ప్రతి రోజూ ఓ ప్రాంతానికి వెళ్లి పాలిస్తుండేవి. ఈ విషయాన్ని కాపరులు గమనించారు.
ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఓ కాపరి పరిశీలించగా.. శివలింగం కనిపించింది. దీంతో స్థానికులకు తెలుపగా, అక్కడ ఓ గుడిని నిర్మించి నిత్యం పూజలు చేయడం ఆరంభించారు.
అయితే ఈ శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అదే ఇందులో ఉండే లింగాకారం క్రమ క్రమంగా పెరుగుతుండటం విశేషం.
తొలిలో శివలింగం చుట్టూ ఓ వలయం ఉండగా.. ఇప్పుడు అది ఆ వలయాన్ని దాటిపోయింది. మీరు ఆ రెండూ ఫోటోలను గమనించి చూడండి.. అర్థమౌతుంది.
ఈ శివాలయం చాలా మహత్యం కలదట. ఇక్కడ ప్రతి ఏడాది మహా శివరాత్రి సమయంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వచ్చి, తమ మొక్కులు తీర్చుకుంటారు.
సుమారు 2 లక్షల 50 వేలకు మందికి పైగా భక్తులు వస్తారని సమాచారం. భక్తుల రద్దీ దృష్ట్యా అక్కడ ఆలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ హిందూ, ముస్లింలు కూడా మత వైషమ్యాలు లేకుండా ఉంటారు.
దాయాదీ దేశంలో కూడా శివుడికి నిత్య నీరాజనాలు అందుకోవడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
0 Comments:
Post a Comment