ముగ్గురు ఉపాధ్యాయులు షోకాజ్
గోపాలపురం, ఫిబ్రవరి 25: విద్యాబో ధనలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని డీఈవో అబ్రహం ఉపాధ్యా యులను హెచ్చ రించారు.మండలంలోని గోపాలపురం, కొవ్వూరుపాడు హైస్కూల్, గుడ్డి గూడెం, సాగిపాడు ప్రాథమిక పాఠశాలలను శని వారం ఆకస్మిక తనిఖీ చేశారు.
8వ తరగతి విద్యార్థు లకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ట్యాబ్ నిర్వహణలో అట్టడుగు శాతం నమోదైనందున గోపా లపురం హైస్కూల్‌లో ప్రసాద్,జయరాజు, కొవ్వూరుపాడు హైస్కూల్‌లో జగదీశ్వర రావుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.గుడ్డిగూడెం, సాగిపాడు ప్రాథమిక పాఠశాలల్లో 3, 5వ తరగతుల విద్యార్థుల వర్క్‌బుక్స్ పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంఈవో శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు సోమశేఖర్, శేషరత్నం తదితరులు ఉన్నారు.
0 Comments:
Post a Comment