జలుబు కామన్గా వచ్చే ఆరోగ్య సమస్యే. చిన్నదే కదా తగ్గిపోతుందని అనుకుంటాం. కానీ అది పెట్టే బాధ అంతా ఇంతా కాదు. చూసే వారికి చిన్న జలుబుకే ఆపసోపాలు అని అనిపిస్తుంది.
జలుబు కోసమని డాక్టర్ల దగ్గరికి వెళ్లేవారు దాదాపు ఎవరూ ఉండరు. దాదాపు అందరూ ఓవర్ కౌంటర్ మెడిసిన్లే వాడతారు.
కానీ ఇలా జలుబు తగ్గేందుకు ఇష్టానుసారంగా మందులు వేసుకోవచ్చా? జలుబు వంటి చిన్న ఇన్ఫెక్షన్లకు కూడా మందులు వేసుకుంటే.. ఇమ్యూనిటి తగ్గుతుందని అంటారు. అయితే, అంతకు మించిన పెద్ద సమస్యలు వస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
మెదడుకు సంబంధించిన ప్రమాదకర జబ్బులకు సాధారణ జలుబు మందులు కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా జలుబును నివారించే మందులు ప్రాణాంతక మెదడు సమస్యలకు కారణమవుతాయని కొత్త పరిశోధనల్లో కనుగొన్నారు.
డీకాంగెస్ట్ మందుల్లో సూడోపెడ్రిన్ అనే పదార్థం ఉంటుంది. వీటిని ఫార్మసీ షెల్ఫ్ ల నుంచి తీసివేయ్యాలని అంటున్నారు నిపుణులు.
సూడోపెడ్రిన్ కలిగిన మందులు తరచుగా తీసుకునే వారిలో పోస్టీరియర్ రివర్సిబుల్ ఎన్సెఫలోపతి సిండ్రోమ్(PRES), రివర్సిబుల్ సెరిబ్రల్ వాసోకాన్స్ట్రిక్షన్ సిండ్రోమ్(RCVS) వంటి సమస్యలు కనిపించాయట. ఇవి చాలా అరుదుగా కనిపించే సమస్యలే.
కానీ చాలా సీరియస్ సమస్యలుగా చెప్పవచ్చు. ఇలాంటి స్థితి ఏర్పడినపుడు మెదడుకు రక్త సరఫరా బాగా తగ్గిపోతుంది. ఫలితంగా ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడవచ్చు.
డికాంగ్నెస్టింట్ మందులు సైనస్ లలో తేమ తiగ్గించి ముక్కుకారడం వంటి లక్షణాలను తగ్గిస్తాయి. అంతే కాదు, వీటి వల్ల రక్తనాళాలు కూడా కుంచించుకు పోవచ్చు.
ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల్లో ఈ మందులు బీపీకి, గుండెసమస్యలకు మందులువాడుతున్న వారిలో ప్రమాదకరంగా పరిణమించవచ్చని నిపుణులు హెచ్చరించారు.
ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారం, ఎవిడెన్స్ లను పరిశీలిస్తున్నట్టు యూకేకి చెందిన మెడిసిన్ రెగ్యులేటర్.. ది ఫార్మాషుటికల్ జర్నల్ ద్వారా ప్రకటించింది.
వీలైనంత ఎక్కువగా మందులు ప్రమాద రహితంగా ఉండేందుకు కావల్సిన అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తామని, అన్నింటి కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమైందని MHRA పునరుద్ఘాటించింది.
PRES, RCVS లక్షణాలు ఏమిటి?
PRES, RCVS చాలా అరుదుగా ఏర్పడే పరిస్థితులు కానీ సమయానికి చికిత్స అందకపోతే ప్రాణాంతకం కావచ్చు.
తరచు తలనొప్పి రావడం, చూపు సరిగ్గా లేకపోవడం, మూడ్ స్వింగ్స్, కొన్ని సార్లు మూర్ఛ, మెదడులో ఇన్ఫ్లమేషన్ వచ్చే ప్రమాదం కూడా PRES వల్ల ఉంటుంది.
RCVS లక్షణాలు నిజానికి త్వరగా రావడం మాత్రమే కాదు తీవ్రంగా ఉంటాయి. చాలా సార్లు ప్రాణాలకు ప్రమాదంగా మారుతాయి. తీవ్రమైన తలనొప్పి, తలలో ఉరుములు మెరుపులు ఉన్నట్టుగా చాలా భయంకరంగా ఉంటుంది.
దీనిని థండర్ క్లాప్ హెడేక్ అంటారు. ఈ సమస్య ఉన్నపుడు తలనొప్పి అకస్మాత్తుగా వస్తుంది. తరచుగా కూడా వస్తుంది. కొన్ని నిమిషాల పాటు ఉంటంది. ఇంతకంటే తీవ్రమైన నొప్పి మీరు జీవితంలో ఎరిగి ఉండరు.
0 Comments:
Post a Comment