అలసిపోయినప్పుడు లేదా నిద్ర వచ్చినప్పుడు మనం తరచుగా ఆవలిస్తాం. ఇది చాలా సాధారణం. ప్రతి వ్యక్తి రోజుకు 5 నుండి 19 సార్లు ఆవలిస్తాడని పరిశోధనలు చెబుతున్నాయి.
అయితే, స్లీప్ ఫౌండేషన్ ప్రకారం, రోజుకు 10 సార్లు కంటే ఎక్కువ ఆవలించే వారు చాలా మంది ఉన్నారు. అలాగే కొన్ని అధ్యయనాల ప్రకారం, రోజుకు 100 సార్లు ఆవలించే వారు చాలా మంది ఉన్నారు.
అయితే కొన్నిసార్లు అధిక ఆవలింతలు కొన్ని తీవ్రమైన వ్యాధులకు ముందస్తు లక్షణాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని మందుల దుష్ప్రభావం కారణంగా ఇలా జరుగుతుందని, వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
విపరీతమైన ఆవలింతలు కొన్నిసార్లు కొన్ని తీవ్రమైన వ్యాధి లేదా అసాధారణ సమస్యలకు సంకేతం కావచ్చు. అటువంటి పరిస్థితిలో, కారణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి నిద్ర రుగ్మతలకు సంకేతం కావచ్చు.
ఇది అధిక పగటి నిద్రకు దారితీస్తుంది. అతిగా ఆవులించడం కూడా జీవక్రియ వ్యాధులకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
నిద్ర లేకపోవడం
సాధారణంగా చాలా మంది పగటిపూట నిద్రపోతారు. దీని కారణంగా వారు విపరీతమైన ఆవలించే సమస్యను ఎదుర్కొంటారు. కొన్ని కారణాల వల్ల రాత్రిపూట తగినంత నిద్ర లేనప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంది. రాత్రి నిద్ర లేకపోవడం వల్ల మరుసటి రోజు బాగా అలసిపోతారు. అప్పుడు వారు ఎక్కువగా ఆవలిస్తారు.
మధుమేహం
ఆవలించడం అనేది హైపోగ్లైసీమియాప్రారంభ లక్షణం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడం వల్ల ఆవలింతలు ఎక్కువగా వస్తాయి.
స్లీప్ అప్నియా
స్లీప్ అప్నియా ఉన్న రోగులు రాత్రి నిద్రించడానికి చాలా ఇబ్బంది పడతారు. ఫలితంగా ఆ వ్యక్తి బాగా అలసిపోయి మరుసటి రోజు ఆవలిస్తాడు. ఈ వ్యాధిలో శ్వాస తీసుకోవడంలో సమస్య ఎదురవుతాయి.
నిద్రలో ఊపిరి ఆగిపోవడం ప్రమాదకరమైన విషయం. తమకు ఈ సమస్య ఉన్నట్లు కూడా చాలామందికి తెలియదు.
నార్కోలెప్సీ
నార్కోలెప్సీ అనేది ఒక రకమైన నిద్రలేమి. దీనిలో ఒక వ్యక్తి ఎప్పుడైనా ఎక్కడైనా హఠాత్తుగా నిద్రపోవచ్చు. ఈ వ్యాధిలో రోగి రోజులో చాలా సార్లు నిద్రపోతాడు. దీని కారణంగా వారు చాలా ఆవలిస్తారు
0 Comments:
Post a Comment