మైఖేల్ జాక్సన్... సంకీత ప్రపంచంలో ఓ ప్రభంజనం. ముఖ్యంగా అగ్రదేశమైన అమెరికాలో ఆయనకు లెక్కలేనంతమంది అభిమానులు వున్నారు.
ఉత్తేజితమైన జాక్సన్ సంగీతానికీ, వేగానికి ప్రత్యామ్నాయ పదంగా మారిన ఆయన స్టెప్పులను ప్రపంచం ఎప్పటికీ మరువలేదు. అయితే, ఆయన జీవితంలోని ఓ పది ఆసక్తికరమైన అంశాలను ఓసారి గుర్తు చేసుకుందాం.
1) శివసేన ఆహ్వానం మేరకు మైఖేల్ జాక్సన్ తొలిసారి ముంబై విచ్చేశారు. విమానాశ్రయంలో సోనాలి బెంద్రే ఆయనకు స్వాగతం పలికారు. ఆ సమయంలో బాలీవుడ్ నుండి మాత్రమే గాక దక్షిణ సినీ సీమ నుండి కూడా చాలామంది తారలు ఆయనను కలుసుకునేందుకు వచ్చారు.
2) మైఖేల్ జాక్సన్ ఆల్బమ్ ‘థ్రిల్లర్’ ఇప్పటి వరకు ఆయన ఆల్బమ్స్ లోనే అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్.
3) అయితే, కెరీర్ లో ఎంత ఉన్నత శిఖరాలను అధిరోహించారో ఆయన జీవితంలో అన్ని వివాదాలు కూడా వున్నాయి. చాలాసార్లు లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నారు మైఖేల్ జాక్సన్. 2002లో తన బిడ్డను బాల్కనీ బయట వేలాడదీసిన విషయం వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయన రెండు రోజులు జైలులో గడిపారు.
4) మైఖేల్ జాక్సన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ గదిలో నిద్రపోయేవారు. ఇలా చేయడంవల్ల ఎక్కువ కాలం జీవించవచ్చునని నమ్మారు జాక్సన్.
5) వివిధ హెచ్ఐవి, ఎయిడ్స్ కారణాలకు మద్దతుగా చేసిన కృషి కారణంగా రోనాల్డ్ రీగన్ చేతుల మీదుగా మైకెల్ జాక్సన్ మానవతా పురస్కారాన్ని అందుకున్నారు ఆయన.
6) మైఖేల్ జాక్సన్ 2009 మార్చిలో అది తన చివరి కచేరీ అని చెప్పారు. అన్నట్టుగానే 2009 జూన్ 25న గుండెపోటుతో మరణించే వరకూ మరే కచేరీ చేయలేదు.
7) మైఖేల్ జాక్సన్ మరణంపై ఇంటర్నెట్ క్రాష్ అయింది. మధ్యాహ్నం 3:15 గంటలకు పాప్ స్టార్ మరణ వార్త వచ్చింది. ఆ తరువాత వికీపీడియా, ఆఓళ్, ట్విట్టర్ కుప్పకూలిపోయాయి.
8) మైఖేల్ జాక్సన్ మరణం తరువాత ఆయన మృతదేహాన్ని రెండుసార్లు పోస్టుమార్టం కోసం పంపారు. ఎందుకంటే, మైఖేల్‌ను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
9) మైఖేల్ పోస్టుమార్టం నివేదికలో ఆయన శరీరంలో చాలా సూదుల గుర్తులు వున్నట్టుగా తేలింది. మరణానికి కొన్ని గంటల ముందు ఆయన పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకున్నట్లు దీని ద్వారా తెలిసింది.
10) మైఖేల్ జాక్సన్ అంతిమ వీడ్కోలు యాత్రను ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీనిని సుమారు 2.5 బిలియన్ల మంది చూశారు. ఇది ఇప్పటికీ అత్యధికంగా వీక్షించిన ప్రత్యక్ష ప్రసారం.
0 Comments:
Post a Comment