ఒక్కోసారి కారణం లేకుండానే గుండెల్లో ఇది అని చెప్పలేని భయం, గూబులు వంటివి కలిగి మనల్ని ఆందోళనకు గురిచేస్తుంటాయి. అలాంటప్పుడు మనకు ఎంజరుగుతుందో అనే భయం మనలో మొదలవుతుంది.
మీకలాంటి అనుభవం ఎదురైనప్పుడు ఆయుర్వేదంలో చెప్పిన ప్రకారం ఈ రకమైన ప్రయత్నం చేసి చుడండి ఫలితం ఉంటుంది.
గుండె దడకు ఇంగువ, పచ్చకర్పూరం మంచి మందు గుండె దడదడలాడ్తున్నట్లుగా వుందా? ఏదో దొంగతనంచేసి దొరికి పోయినట్లు భయం భయంగా వుంటోందా? కొద్దిపాటి అలసటకే ఎదనొప్పులు వచ్చేసి కూలబడి పోతున్నారా?
అయితే ఈ విషయాలను జాగ్రత్తగా గమనించండి. 1. మీరు బరువు ఎక్కువగా వున్నారేమో చూసుకోండి. 2. బీ.పీ.
ఎంతవుందో పరీక్షచేయించుకోండి. 3. షుగర్ పరీక్ష కూడా చేయించండి. 4. చెస్ట్ ఎక్స్ -రే తీయించి గుండె ఆకారం సమానంగానే వుందా గుండె పెరిగిందా తెలుసుకోండి.
5. అవసరం అయితే గుండెజబ్బుల నిపుణుడి సలహా పొందండి. ఇపిజిల వంటివన్నీ వైద్యులు తీయిస్తారు. 6. కొంత వరకూ నల్లగా ముద్దగా వుండే ఇంగువలో సమానంగా పచ్చకర్పూరాన్ని కలిపి చిన్న మాత్రలు చేసుకొని మూడుపూటలా ఒకొక్కటి చొప్పున తీసుకోండి. దడగా భయంగా వుండటం నెమ్మదిస్తుంది. మరీ అతిగా వాడకండి!
0 Comments:
Post a Comment