BIG BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం..ఈడీ ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం, వైసీపీ ఎంపీ పేర్లు
ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా ఈడీ రెండో ఛార్జ్ షీట్ లో కీలక వ్యక్తుల పేర్లు పేర్కొంది.
ఏకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Delhi cm Kejriwal), వైసీపీ ఎంపీ మాగుంట పేర్లు ఛార్జ్ షీట్ లో ఈడీ పేర్కొంది. అలాగే అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబు సహా మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి వచ్చిన డబ్బును ఆప్ గోవాలో ఎన్నికల ప్రచారానికి వాడారని ఈడీ పేర్కొంది. ఇక సాక్ష్యాలు ధ్వంసం చేసిన వారి పేరులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. అలాగే విచారించిన జాబితాలో కవిత పేరును ఈడీ పేర్కొంది. ఇక ఈడీ (Enforcement Directorate) ఛార్జ్ షీట్ లో తన పేరును ప్రస్తావించడంపై కేజ్రీవాల్ (Delhi cm Kejriwal) సెటైర్లు వేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఈడీ పని చేయడం లేదు. ప్రభుత్వాలను కూల్చడానికి ఈడీ (Enforcement Directorate) పని చేస్తుంది. ఈ ఛార్జ్ షీట్ మొత్తం ఒక కల్పితమని ఢిల్లీ సీఎం కొట్టిపడేశారు.
428 పేజీలతో ఈడీ ఛార్జ్ షీట్..
మొత్తం 428 పేజీలతో ఈడీ సెకండ్ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. మద్యం పాలసీ రూపొందించే సమయానికి కేజ్రీవాల్ కు అత్యంత సన్నహితుడైన విజయ్ నాయర్ తో మాట్లాడినట్టు ఈడీ పేర్కొంది. ఇక ఈ ఛార్జ్ షీట్ లో ఏకంగా రాష్ట్ర సీఎంను చేర్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి రానున్న రోజుల్లో మద్యం కుంభకోణంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ (Enforcement Directorate) ఇప్పటికే తొలి ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ సుమారు 3 వేలకు పైగా పేజీలతో ఉన్నట్టు అధికారులు కోర్టుకు తెలిపారు. కాగా ఈ కేసులో వ్యాపారవేత్త సమీర్ మహేంద్రను అరెస్ట్ చేసి 60 రోజులు అవుతున్న క్రమంలో ఈడీ (Enforcement Directorate) ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. కాగా ఈ కేసులో ఇదే తొలి ఛార్జ్ షీట్. ఇక తాజాగా రెండో ఛార్జ్ షీట్ ను ఈడీ విడుదల చేసింది.
0 Comments:
Post a Comment