Balakrishna- Tarakaratna: సినీరంగంలో ఆయన అగ్రనటుల్లో ఒకరు. రాజకీయంగా ఆయనది కీలకమైన స్థానం. నిత్యం షూటింగుల్లో, రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు.
కుటుంబ సభ్యులతో సమయం గడపాలన్నా తీరిక దొరకనంత బిజీగా ఉంటారు. కానీ అన్న కొడుకు ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతుంటే.. అన్నీ తానై చూసుకుంటున్నారు. తన బిజీ షెడ్యూల్ కి విరామమిచ్చి.. ఆస్పత్రికి అంకితమయ్యారు. తండ్రి తర్వాత తండ్రిగా బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు.
Balakrishna- Tarakaratna
కుప్పం నారాలోకేష్ పాదయాత్రకు వెళ్లిన నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐసీయూలో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు.
తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే… తారకరత్నకు గుండెపోటు వచ్చిన నాటి నుంచి బాబాయ్ నందమూరి బాలకృష్ణ కంటికి రెప్పలా చూసుకుంటున్నారని చెప్పవచ్చు. తారకరత్న ఆరోగ్యం పై బాలయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
అన్నీ తానై చూసుకుంటున్నారు. గత కొన్నిరోజులుగా ఆస్పత్రిలోనే మకాం వేసి తారకరత్నకు మెరుగైన వైద్యం అందించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మొదట తారకరత్న గుండె కొట్టుకోవడం ఆగిపోయిన సందర్భంలో బాలకృష్ణ స్పందించిన తీరు కారణంగా తిరిగి తారకరత్న కోలుకున్నారని వైద్యులు వెల్లడించారు.
ఇప్పుడు తారకరత్న ఆరోగ్యం కుదుటపడాలని బాలయ్య మరో సంకల్పం తీసుకున్నారు. అఖండ దీపారాధన చేపట్టారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బత్తలాపురంలో మృత్యుంజయస్వామి ఆలయంలో అఖండజ్యోతి దీపారాధన కొనసాగుతోంది.
కఠోరదీక్షతో నియమబద్ధంగా అఖండ దీపారాధన కొనసాగుతుంది. దీపాలను ప్రమిదల్లో కాకుండా.. మట్టి, కంచు పాత్రల్లో వెలిగిస్తారు. అఖండజ్యోతి దీపారాధన దాదాపు 44 రోజులు కొనసాగనుంది.
Balakrishna- Tarakaratna
తారకరత్న ఆరోగ్యం కూడా రోజురోజుకు మెరుగవుతోంది. గుండె, కాలేయం పనితీరు మెరుగ్గా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మెదడుకు సంబంధించిన చికిత్స జరగనుంది.
అయితే.. తారకరత్న ఆరోగ్యం గురించి బాలయ్య తీసుకున్న శ్రధ్ధ అంతా ఇంత కాదు. మొదటి రోజు నుంచి తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని పరితపిస్తున్నారు.
అన్నకొడుకును కూడా సొంత కొడుకులా కంటికి రెప్పలా కాచుకుని ఉన్నాడు. బాలయ్య తీరు ఆయన అభిమానుల్ని గర్వపడేలా చేస్తోంది. బాలయ్య తారకరత్న కోసం చేస్తున్న కృషి ఫలించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
0 Comments:
Post a Comment