ఎంతో కష్ట పడి జాబ్ తెచ్చుకున్నాక..
ప్రతినెల వచ్చే జీతంలో రూపాయి కూడా మిగలకపోతే ఇదేం జీవితం రా బాబు అనిపిస్తుంది. అందులోనూ బ్యాచీలర్స్ బాధలు కాస్త ఎక్కువగానే ఉంటాయి.
మనీ మేనేజ్‌మెంట్ తెలియక.. డబ్బులు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం.. నెల చివరి రోజుల్లో ఎవరో ఒకరి దగ్గర మనీ కావాలంటూ హెల్ప్ అడగడం మోస్ట్ కామన్ థింగ్‌గా మారిపోయింది. Image Credit Pexels
మళ్లీ జీతం పడగానే హెల్ప్ చేసిన వాళ్లకి మనీ రిటర్న్ చేయడంతో కొత్త నెలను ప్రారంభిస్తారు బ్యాచీలర్స్. ఈ నెల కూడా అంతే.. జీతం పడ్డ మొదటి 15-20 రోజుల్లో అదుపు, పొదుపు లేకుండా డబ్బులను ఖర్చు చేయడం.. అనవరమైన వాటికి జీతం దుబారా చేయడం.. తర్వాత మళ్లీ హెల్ప్ అంటూ వాళ్లకీ, వీళ్లకీ మెసేజ్ చేయడం.. ఇదో లైఫ్ సైకిల్‌లా అలవాటైపోతుంది. Image credit Shutter stock
ఇలా పొదుపు లేకుండా, విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు చేయడం ఎంత మాత్రం మంచిది కాదు.. అందుకే ప్రతి బ్యాచీలర్ పర్శనల్ బడ్జెట్ వేసుకోవాల్సిన అవసరముంది. Image Credit Pexels
ముందుగా మీ నెల జీతం ఒక నోట్‌పై రాసుకోండి. మన రోజువారీ ఖర్చుల డేటాను చూసుకోండి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్‌కి సపరేటుగా ఎంత అవుతుందో చెక్ చేసుకోండి. మీ జీతంతో వీటిని క్యాలుక్లేట్ చేయండి. మీకు అత్యవరమైనవి వాటి ఖర్చు కూడా లెక్కించండి. Image Credit Pexels
మీ బడ్జెట్లో నిజాలు లేకపోతే మీరు దాన్ని అనుసరించలేరు. మీరు 40రూపాయలతో బజ్జిలు కొంటే.. అది కూడా మీ ఖర్చులలో రాయండి. వీకెండ్‌లో సినిమాకు వెళ్తున్నారా? టిక్కెట్ల ఖర్చు కూడా రాసుకోండి. విచక్షణ లేని ఖర్చుల వల్ల మీరు ప్రతీ సంవత్సరం వేలాది రూపాయలను వెస్ట్‌గా ఖర్చు పెడుతున్నారు. Image Credit Pexels
ఇప్పుడు మీ జీతం డబ్బులు ఇంకా ఏమైనా మిగులుతున్నాయేమో చూడండి. ఒకవేళ మిగిలితే వాటిని సేవింగ్స్ కిందే కన్సిడర్ చేయండి. కుదిరితే పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుల్లో ప్రతినెలా డిపాజిట్ చేయడం అలవాటు చేసుకోండి.
అటు ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ వద్దు. ఆరోగ్యకరమైన ఫుడ్‌ను ప్రతిరోజూ తీసుకోవడానికి డబ్బులు గురించి ఆలోచించద్దు..! తక్కువ మనీతో ఎక్కువ ప్రొటిన్ ఫుడ్ ఇచ్చే ఐటేమ్స్ చాలానే ఉంటాయి. వాటిఫై ఫోకస్ పెట్టిండి.
ఫాస్ట్ ఫుడ్ లాంటి వాటికి దూరంగా ఉండండి. హైదరాబాద్‌లో ఉండే కొంతమంది బ్చాచీలర్స్ రోజూ బిర్యానీ తింటుంటారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. కేవలం డబ్బులు వెస్ట్ అవ్వడమే కాదు.. దీని కారణంగా ఆరోగ్యం కూడా పాడవుతుంది.
ఇది లాంగ్ టర్మ్‌లో ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పుడో ఒకసారి తీనేలాగా ప్లాన్ చేసుకోండి. వారానికి ఒకసారి తినడం లేదా.. ఏదైనా సందర్భమునప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి తినడం లాంటివి చేయడండి.
మీకున్న సేవింగ్స్‌తో హెల్త్ ఇన్సూరెన్స్‌కు బడ్జెట్ పెడితే అది భవిష్యత్తులో చాలా యూజ్ అవుతుంది. Image Credit Pexels
సేవింగ్సే లైఫ్‌గా బతకమని కాదు.. మీకున్న జీతాన్ని ఎంజాయ్‌మెంట్‌కు కూడా ఖర్చు చేసుకోవచ్చు. కానీ ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్‌తో చేస్తే అది ఎంజాయ్‌మెంట్ అవుతుంది కానీ.. రోజూ అదే చేస్తే వ్యసనంగా మారుతుంది. డబ్బులు కూడా కనపడకుండానే ఆవిరైపోతాయి. అందుకే పర్శనల్ బడ్జెట్ ప్లాన్ మస్ట్‌గా ఉండాలి.
0 Comments:
Post a Comment