ఏపీలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల హాజరు నమోదుపై ఇవాళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ సర్కులర్ పంపింది.
దీన్ని సచివాలయంతో పాటు అన్ని శాఖల్లోనూ అమలు చేయాలని ఆదేశించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల హాజరు నమోదు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ ఏపీఎఫ్ఆర్ఎస్ లో నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో సాధారణ పరిపాలన శాఖ సచివాలయంతో పాటు అన్ని శాఖల విభాగాధిపతులకు సర్కులర్ పంపింది.
ఇందులో ప్రభుత్వం ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా ముఖ ఆధారిత హాజరు నమోదుకు ఇప్పటికే నిర్ణయంతీసుకుందని, కానీ ఉద్యోగుల్ని ఇందులో నమోదు చేయించే ప్రక్రియ నత్తనడక సాగుతోందని తెలిపింది. దీన్ని 100 శాతం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇందులో పేర్కొంది.
ఇందుకోసం ఉద్యోగులకు అవసరమైతే స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి ఈ యాప్ లో వందశాతం నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని సర్కులర్ లో ప్రభుత్వం తెలిపింది.
ఇకపై కేవలం ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారానే హాజరు నమోదు చేయబోతున్నట్లు వెల్లడించింది.
కాబట్టి విభాగాధిపతులు, నోడల్ అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకుని వందశాతం ఉద్యోగుల్ని ఇందులో నమోదు చేయించాలని కోరింది. ఈ ప్రక్రియలో ఎట్టి పరిస్దితుల్లోనూ విఫలం అయితే వారినే బాధ్యుల్ని చేస్తామని తెలిపింది.
0 Comments:
Post a Comment