సమగ్రశిక్ష ఏపీసీపై వేటు
మాతృసంస్థకు పంపిస్తూ ఉత్తర్వులు
విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: సమగ్రశిక్ష అదనపు పథకం సమన్వయకర్త వి.అప్పలస్వామి నాయుడిని మాతృసంస్థకు పంపిస్తూ మంగళవారం కలెక్టర్ సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
డిగ్రీ కళాశాలలో లైబ్రేరియన్‌గా పనిచేస్తూ డిప్యుటేషన్‌పై జిల్లాకు ఏపీసీగా వచ్చారు. ఏడాది సర్వీసు పూర్తయినా డిప్యుటేషన్ కొనసాగింపు ఇంకా రాలేదు. పలువురి ఫిర్యాదుల మేరకు గతేడాది ఆయనపై ఉన్నతాధికారులు విచారణ నిర్వహించారు. ఈ నెల 5న శాఖాపరమైన సమావేశం పేరుతో కేజీబీవీ ప్రత్యేకాధికారులు, ఉపాధ్యాయులకు సంక్షిప్త సమాచారం అందించి, వైకాపా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పరిచయ కార్యక్రమం నిర్వహించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అయనను మాతృసంస్థకు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో డీఈవో బి.లింగేశ్వరరెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
0 Comments:
Post a Comment