AP Police - ఏపీ పోలీసు అభ్యర్థులకు అలర్ట్, 'పార్ట్-2' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! చివరితేది ఇదే!
ఏపీ లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 5న వెలువడిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు (20.73 శాతం) ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు.
ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించి స్టేజ్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 13న ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 20న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్ లైన్ నెంబర్లు 9441450639, 9100203323కు లేదా slprb@ap.gov.in మెయిల్లో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సూచించింది.
AP Constable Part - II Registration
పోస్టుల వివరాలు..
* కానిస్టేబుల్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 6100
1) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్సీటీ) కానిస్టేబుల్- సివిల్ (మెన్/ఉమెన్): 3580 పోస్టులు
శారీరక ప్రమాణాలు:
➨ పురుష అభ్యర్థులు నిర్దేశిత పొడవు, ఛాతీ కలిగి ఉండాలి. మహిళా అభ్యర్థులైతే నిర్దేశిత పొడవు, బరువు కలిగి ఉండాలి.
🔰 ఫిజికల్ ఈవెంట్లు ఇలా..
➨ సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
➨ ఏపీఎస్సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
🔰 మెయిన్ పరీక్ష విధానం:
➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
➨ సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
➨ ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్కు కేటాయిస్తారు.
కానిస్టేబుల్ పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
0 Comments:
Post a Comment