PVRNEWS777,ఫిబ్రవరి 4,2023: భారతదేశంలో ఇటీవల రక్తహీనత సమస్యతో బాధపడేవారు సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యను మరింతగా ఎదుర్కొంటున్నారు.
ఒక నివేదిక ప్రకారం, దేశంలో 15-49 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో 57 శాతం మంది మహిళలు, 25 శాతం మంది పురుషులు రక్తహీనతతో బాధపడుతున్నారు.15 ఏళ్లలోపు బాలికల్లో 46శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
ఈ సమస్య గురించి మనం అర్థం చేసుకొని, 2047 నాటికి దేశాన్ని రక్తహీనత రహితంగా మార్చే లక్ష్యాన్ని సాధించడం కోసం కృషిచేయనుంది కేంద్ర సర్కారు.
రక్తహీనత..
రక్తహీనత అనేది శరీరంలో రక్తం లేకపోవడాన్ని సూచిస్తుంది. రక్తహీనత అనేది మీ శరీర కణజాలాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు ఉండవు.
రక్తహీనతను హిమోగ్లోబిన్ లోపం అని కూడా అంటారు. ఆహారంలో తగినంత ఐరన్, విటమిన్"డి" లేకపోవడమే ప్రధాన కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు.
రక్తహీనత ఎందుకు వస్తుంది?
ఆహారంలో ఐరన్, విటమిన్ బి-12, ఫోలేట్ ,కాపర్ లేకపోవడం వల్ల రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది. ఇది కాకుండా, పేగు వ్యాధి వంటి కొన్ని అంతర్లీన ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు కూడా ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు.
క్రోన్'స్ వ్యాధి మరియు ఉదరకుహర వ్యాధి వంటి ప్రేగు సంబంధిత వ్యాధులు శరీరంలోని పోషకాల శోషణను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతాయి.
ఇది కాకుండా, బహిష్టు సమయంలో మహిళల్లో రక్తం లేకపోవడం ,పోషకాలు తీసుకోకపోవడం వల్ల, మహిళల్లో దీని ప్రమాదం ఎక్కువగా తలెత్తుతుంది.
ఆరోగ్య భరతం కోసం ప్రత్యేక ప్రణాళికలు..
ఒక అంచనా ప్రకారం దేశంలో ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తహీనత నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు అట్టడుగు స్థాయిలో సమిష్టి కృషి అవసరం.
ముఖ్యంగా గ్రామీణ మహిళల్లో తగినంత పోషకాలు లేకపోవడంతో ఎక్కువమంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అందుకే కేంద్ర సర్కారు శ్రద్ధ పెట్టింది.
ఇందుకోసం అవగాహన కార్యక్రమాలపై మరింత దృష్టి సారించాలని పేర్కొంది. అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది.
2023-24 బడ్జెట్‌లో ఆరోగ్య రంగంలో మెరుగుదల కోసం ప్రత్యేకంగా సృష్టిసారించింది కేంద్రం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ఆరోగ్యానికి సంబంధించి ఈ బడ్జెట్ లో ఒక ప్రకటన చేశారు.
2047 నాటికి దేశాన్ని రక్తహీనత రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది కాకుండా 157 కొత్త నర్సింగ్ కాలేజీలను ప్రధాన ప్రదేశాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
0 Comments:
Post a Comment