భారతదేశాన్ని డయాబెటిస్ వణికిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండగా, తాజాగా ఐ సి ఎం ఆర్ అధ్యయనంలో వెలుగు చూసిన అంశాలు దేశాన్ని మరింత వణికిస్తున్నాయి.
భారతదేశం మధుమేహ భారతంగా మారడానికి ఎంతో సమయం పట్టేలా లేదని తాజా అధ్యయనాలు తేల్చి చెప్పాయి.
దీర్ఘకాలిక వ్యాధులపై షాకింగ్ సర్వే .. డయాబెటిస్ డేంజర్ బెల్స్
దీర్ఘకాలిక వ్యాధులపై ఐసిఎంఆర్, ఎన్ఐఎన్ సహా 21 సంస్థలు సర్వే నిర్వహించాయి. దేశవ్యాప్తంగా 600 ప్రాంతాల నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 18 ఏళ్ల నుండి 69 ఏళ్ల వయసు మధ్య ఉన్న 10వేల 659 మందిని సర్వే చేసి ఒక కీలక విషయాన్ని వెల్లడించారు.
ఇందులో దేశంలో అధిక బరువు, ఉబకాయం కారణంగా 73 శాతం మందికి షుగర్ వచ్చే అవకాశం ఉందని తెలిసింది. దేశవ్యాప్తంగా 98.4 శాతం మంది సరిపడా కూరగాయలు, పండ్లు తినడం లేదని, వారికి శరీరానికి కావలసిన పోషకాలు అందడం లేదని పేర్కొంది.
దేశంలో ఊబకాయం, మధుమేహం, బీపీ ప్రధాన సమస్యలుగా
2040 నాటికి ఊబకాయుల సంఖ్య మూడింతలు పెరిగే ప్రమాదం ఉందని చెప్పిన సర్వే ఊబకాయం కారణంగా ఎక్కువ మంది షుగర్ బాధితులుగా మారే అవకాశం ఉందని, దీర్ఘకాలిక సమస్యలతో చాలామంది బాధపడతారని పేర్కొంది.
ఇప్పటికే 34 శాతం మందికి బీపీ ఉందని, ముఖ్యంగా పురుషుల్లోనే బిపి ఎక్కువగా ఉందని సర్వే రిపోర్ట్ వెల్లడించింది. ఇక భారత దేశంలో ప్రతి సంవత్సరం మధుమేహ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. భారతదేశంలో ఇప్పటికీ 77 మిలియన్ల ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా వేయబడింది.
అధికారిక లెక్కల ప్రకారం మాత్రమే ఈ సంఖ్య, అనధికారికంగా మధుమేహం బారినపడి బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నట్టుగా తెలుస్తుంది.
ప్రపంచంలోనే మధుమేహం ఎక్కువ ఉన్న రెండో దేశం
ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మధుమేహంతో ప్రభావితమైన రెండవ దేశంగా ప్రస్తుతం భారతదేశం కనిపిస్తుంది.
ప్రపంచంలో మధుమేహం ఉన్న ఆరుగురిలో ఒకరు భారతదేశం నుంచే ఉన్నారు అంటే భారతదేశంలో ఎంత ఎక్కువగా మధుమేహం ప్రభావం ఉందో అర్థం చేసుకోవచ్చు.
జీవనశైలి మార్పుల వల్ల మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. భారతదేశంలో మధుమేహం అతి పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ప్రస్తుతం మన దగ్గర 77 మిలియన్ల మంది మధుమేహంతో జీవిస్తున్నారు .
మరో 80 మిలియన్ల మంది ప్రీ-డయాబెటిక్ గా ఉన్నారు. అలాగే, ప్రీ-డయాబెటిక్స్ చాలా వేగంగా డయాబెటిస్‌గా మారే అవకాశం ఉంటుంది. 2045 నాటికి భారతదేశంలో 135 మిలియన్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటారని అంచనా వేయబడింది.
తాజా అధ్యయనంతోనైనా అలెర్ట్ అవ్వాల్సిన అవసరం
ఇక తాజా అధ్యయనంతో దేశంలో షుగర్ బాధితులు మరింత పెరిగే అవకాశం ఉందని ఐ సి ఎం ఆర్ తేల్చి చెప్పింది .
దేశంలో మధుమేహం డేంజర్ బెల్స్ ముగిస్తుందని ఐ సి ఎం ఆర్ తాజా అధ్యయనంతోనైనా అలెర్ట్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది.
ఈ సమయంలో మధుమేహానికి కారణం అవుతున్న అధిక బరువు విషయంలో జాగ్రత్త. నిర్లక్ష్యం వహిస్తే జీవిత కాలం డయాబెటిస్ బాధితులుగా మారి మందులు వేసుకుంటూ బ్రతకాల్సి వస్తుంది. కాబట్టి బీ కేర్ ఫుల్.
0 Comments:
Post a Comment