YCP MLA: రచ్చకెక్కిన ఉదయగిరి ఎమ్మెల్యే వ్యవహారం.. మూడు పెళ్లిళ్ల వివాదంలో ఎవరి వాదన నిజం..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) మరోసారి మూడు పెళ్లిళ్ల వివాదంపై దుమారం రేగుతోంది.
మొన్నటి వరకు జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను టార్గెట్ చేస్తూ.. వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. మంత్రులు.. ఇతర నేతలు సైతం పవన్ మూడుపెళ్లిళ్లపై నిత్యం కామెంట్లు చేసేవారు.. కానీ ఇప్పుడు అదే పార్టీకి చెందన ఎమ్మెల్యే చుట్టూ మూడు పెళ్లిళ్ల వివాదం ముసురుకుంది. ఆ ఎమ్మెల్యే ఎవరు అంటే..? నెల్లూరు జిల్లా (Nellore District) ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapatii Chandra Sekhar Reddy) రూటే సెపరేటు. ఆయన రాజకీయం.. ఆయన హావబాలే వేరు అంటారు నెల్లూరు జిల్లా వాసులు. ప్రస్తుతం పొలిటికల్ నగర్ లో టాక్ అఫ్ ది టౌన్ గా మారారు చంద్రశేఖర్ రెడ్డి.
ఇందుకు కారణం లేక పోలేదు.. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని చంద్రశేఖర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ప్రటించారు. ఇంతలోనే ఓ యువకుడు మరి నేను మీ వారసుడిని కదా అంటూ సోషయల్ మీడియా వేదికగా బహిరంగ లేక రాశాడు. దింతో ఇదేం చోద్యం అంటూ ఏపీ వ్యాప్తంగా ఎమ్మెల్యే మూడో పెళ్లి రచ్చ తీవ్ర దూమారం రేగుతోంది.
బహిరంగ లేఖ మాత్రమే విడుదల అయితే సరే అదేదో కట్టుకదలే అని జనాలు వదిలేసేవారు. ఆ యువకుడు తన తల్లితో పాటు చంద్రశేఖర్ రెడ్డితో ఉండే ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఆ ఫోటోలు సైతం సామజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి.
వివాదం పై ఎమ్మెల్యే స్పందన ఏంటి..?
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమారుడినని బహిరంగ లేఖ రాసిన మేకపాటి శివ చరణ్ రెడ్డి తన కుమారుడే కాదని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు ఇద్దరు కూతుళ్ళు మాత్రమే ఉన్నారని కొడుకులు లేరని ఆయన స్పష్టం చేశారు. తన మొదటి భార్య తులసమ్మకు సంతానంగా రచన. రెండో భార్య శాంతకుమారికి సాయి ప్రేమితారెడ్డి ఉన్నారన్నారు.
కేవలం డబ్బులు కోసమే తల్లీ, కొడుకులు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు.
రాజకీయంగా అయితే నేరుగా తనను ఎదుర్కోవాలని చంద్ర శేఖర్ రెడ్డి శివచరణ్ రెడ్డికి సవాల్ విసిరారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలపై శివచరణ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. శివ చరణ్ అసలైన నాన్న కొండారెడ్డి అని, ఆయనతోనే శివ చరణ్ రెడ్డి తల్లి లక్ష్మి దేవికి వివాహం అయిందని... ఆ విషయం తన తల్లినే అడిగి తెలుసుకోవాలనే సూచించాడు.
యువకుడు మేకపాటి శివ చరణ్ రెడ్డి రాసిన లేఖలో ఏముంది..?
శివచరణ్ రెడ్డి తెరపైకి వచ్చారు. నేనెవరు అంటూ ఆయన ఓ ప్రశ్న సంధిస్తూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. చిన్ననాటి నుంచి నాన్న చంద్రశేఖర్ రెడ్డితోనే అమ్మ తాను కలసి ఉండే వాళ్లమని చరణ్ రెడ్డి వీడియో రిలీజ్ చేశాడు. మాతో కలసి ఉన్నపటికీ ఆయన కేవలం తన బాగోగులు మాత్రమే చూసుకొనేవాడని శివ చరణ్ రెడ్డి ఆరోపించాడు.
తన చదువుకయ్యే ఖర్చులు కూడా నాన్నగారే భరించరాని.. ఎప్పుడైనా దగ్గరకు వెళ్లినా దూరంగా పెట్టేవారని చెప్పుకొచ్చారు శివచరణ్ రెడ్డి. కుటుంబ గౌరవం కోసం తాము బయటకు రాలేదన్నారు. ఇటీవల శాంతి కుమారికి న్యాయం చేసినట్టే తమకు కూడా న్యాయం చేయాలంటూ శివచరణ్ రెడ్డి బయటకొచ్చానని శివ చరణ్ రెడ్డి స్పష్టం చేసాడు. తాను డీఎన్ఏ టెస్టుకు ఐన సిద్ధం అంటున్నాడు యువకుడు.
0 Comments:
Post a Comment