చాలా మంది కొన్ని పనులు రాత్రి పూట చేస్తుంటారు. కానీ ఇలాంటి పనులు రాత్రి పూట చేస్తే మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ పనులు చేయడం వల్ల పేదరికం వస్తుందట.
లక్ష్మీదేవి కటాక్షం ఉండదట. మరి రాత్రి పూట చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం..
ఊడ్చొద్దు
చాలా మంది రాత్రిపూట ఊడ్చుతారు. కానీ ఇది వాస్తు ప్రకారం మంచిది కాదు. శాస్త్రాల ప్రకారం, చీపురును లక్ష్మీ దేవిగా భావిస్తారు. అందుకే రాత్రిపూట ఊడ్చుస్తే మంచిది కాదట.
మంచం మీద ఆహారం తినడం
చాలా మంది మంచం మీద ఆహారం తింటారు. కానీ ఇది మంచిది కాదు. మంచం మీద ఆహారం తినడం వాస్తు శాస్త్రంలో నిషిద్ధం. ఇది వాస్తు దోషాలను సృష్టిస్తుందట. ఇది కుటుంబం ఆనందం, శాంతిని ప్రభావితం చేస్తుందట.
బట్టలు ఉతకడం
కొంత మంది రాత్రి పూట బట్టలు ఉతకుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకడం మానుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుందట. ఎందుకంటే రాత్రిపూట ప్రతికూల శక్తులు ప్రబలుతాయట.
అప్పు
సూర్యుడు అస్తమించిన తర్వాత అప్పు ఇవ్వొద్దు. సూర్యుడు అస్తమించిన తర్వాత అప్పు ఇవ్వకూడదని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. ఇలా చేయడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మీపై అప్పుల భారం పెరగవచ్చు.
0 Comments:
Post a Comment