Jagan Govt.: జగన్ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు రాజ్‌భవన్‌కు ఉద్యోగ సంఘాల నేతలు
అమరావతి:
జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై ఫిర్యాదు చేసేందుకు రాజ్‌భవన్ (Rajbhavan)కు ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు (AP Employees Union Leaders) వెళ్లారు
ఉద్యోగ సంఘాల నాయకులు గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. *జనవరి 15 తర్వాత ప్రభుత్వం ఏ విషయం తేల్చకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఇప్పటికే ఏపీ జేఏసీ అమరావతి నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే.* ఏపీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సూర్యనారాయణ, కార్యదర్శి భాస్కరరావు, జనరల్ సెక్రటరీ, వారితోపాటు మరో ఆరుగురు గురువారం ఉదయం రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. *ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగ వ్యవస్థపై ప్రత్యక్ష సంబంధాలు, అధికారులు గవర్నర్ (Governor)కు ఉంటాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించలేకపోతోంది.* దీనిపై నేరుగా గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఉద్యోగ సంఘాల నేతలు ఇవాళ రాజ్‌భవన్‌కు వెళ్లారు. కోట్లాది రూపాయల బకాయిలు, పెన్షన్ల చెల్లింపుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలని, లేకపోతే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడతారని,
ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది... *15వ తేదీ వరకు జీతాలు పడుతునే ఉంటాయని, పెన్షన్ల పరిస్థితి అలాగే ఉందని..* ఈ అంశాలన్ని గవర్నర్‌కు వివరించనున్నారు. *రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో గవర్నర్‌కు జీతాలు రావడంలేదని, సకాలంలో బెనిఫిట్స్ రావడంలేదని ఫిర్యాదు చేయడం ఇదే మొదటిసారి.*
0 Comments:
Post a Comment