Search This Blog

Monday, 2 January 2023

Top ELSS Funds to invest : ట్యాక్స్​ సేవింగ్స్​​తో పాటు మంచి రిటర్నులు



 Top ELSS Funds to invest in 2023 : ఇన్​వెస్ట్​మెంట్​తో నూతన ఏడాదిని ప్రారంభించాలని భావిస్తున్నారా?

ఇది మీ న్యూ ఇయర్​ రిసొల్యూషన్​ ఆ? అయితే మ్యూచువల్​ ఫండ్స్​ అనేవి మీకు మంచి ఆప్షన్​ అవుతుంది. 

ఇక 'ఇన్​వెస్ట్​మెంట్​తో పాటు పన్ను ఆదా అయితే బాగుంటుంది కదా!' అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఈఎల్​ఎస్​ఎస్​ మ్యూచువల్​ ఫండ్​ స్కీమ్​ సరిగ్గా సూట్​ అవుతుంది. ఐసీఐసీఐ డైరక్ట్​ చెబుతున్న టాప్​ 5 ఈఎల్​ఎస్​ఎస్​ మ్యూచువల్​ ఫండ్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాము..

ఈఎల్​ఎస్​ఎస్​ మ్యూచవల్​ ఫండ్స్​ అంటే ఏంటి?

1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్​ 80సీ కింద.. పెట్టుబడుల మీద ట్యాక్స్​ను ఆదా చేసుకోగలిగే వెసులుబాటు ఉన్న మ్యూచువల్​ ఫండ్​ స్కీమ్​ ఈ 'ఈఎల్​ఎస్​ఎస్​'. ట్యాక్స్​ సేవింగ్స్​తో పాటు దీర్ఘకాలంలో ఇండియా ఈక్విటీ మార్కెట్​ నుంచి మంచి లాభాలు రాబట్టగలిగే సత్తా వీటికి ఉండటం విశేషం.

 80సీ ఆప్షన్​ ఉన్న పెట్టుబడి మార్గాల్లో.. అధిక రిటర్నులు తెచ్చిపెడుతుంది ఈ ఈఎల్​ఎస్​ఎస్​ మ్యూచువల్​ ఫండ్​. అయితే.. ఈ ఫండ్స్​కు 3 ఇయర్​ లాకిన్​ పీరియడ్​ ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

టాప్​ ఈఎల్​ఎస్​ఎస్​ మ్యూచువల్​ ఫండ్స్​..

కెనెరా రోబెకో ఈక్విటీ ట్యాక్స్​సేవర్​ ఫండ్​:-

Canara Robeco Equity Taxsaver fund : ఈ మ్యూచువల్​ ఫండ్​ను 2013 జనవరి 2న లాంచ్​ చేశారు. వాల్యూ రీసెర్చ్​.. ఈ ఫండ్​కి 5స్టార్​ రేటింగ్​ ఇవ్వగా.. క్రిసిల్​.. 4స్టార్​ రేటింగ్​ ఇచ్చింది. 2022 నవంబర్​ 30 నాటికి ఈ మ్యూచవల్​ ఫండ్​ వద్ద రూ. 4,583కోట్ల ఏయూఎం(అసెట్​ అండర్​ మేనేజ్​మెంట్​) ఉంది. 

దీని ఎక్స్​పెన్స్​ రేషియో 0.61శాతం. ఎస్​ అండ్​ పీ బీఎస్​ఈ 500 టీఆర్​ని ఇది ట్రాక్​ చేస్తుంది. ఫైనాన్స్​ సెక్టార్​లో మెజారిటీ పెట్టుబడులు ఉన్నాయి. ఐటీ, ఆటో, ఆరోగ్య రంగాల్లోని స్టాక్స్​ ఇందులో ఉన్నాయి. రూ. 500తో సిప్​ను మొదలుపెట్టొచ్చు. లేదా రూ. 500తో లామ్​సమ్​ కూడా చేయవచ్చు.

ఈ రోబెకో ఈక్విటీ ట్యాక్స్​సేవర్​ ఫండ్​.. ఏడాదిలో 7.9శాతం, రెండేళ్లల్లో 10.34శాతం, మూడేళ్లల్లో 20.21శాతం రిటర్నులు ఇచ్చింది.

ఫ్రాన్​క్లిన్​ ఇండియా ట్యాక్స్​షీల్డ్​ ఫండ్​..

Franklin India Taxshiled fund 3 year returns : ఈ ఈఎల్​ఎస్​ఎస్​ మ్యూచువల్​ ఫండ్​ను 1999 ఏప్రిల్​ 10న లాంచ్​ చేశారు. క్రిసిల్​, వాల్యూ రీసెర్చ్​ నుంచి ఈ ఫండ్​ 3స్టార్​ రేటింగ్​ని అందుకుంది. 2022 నవంబర్​ 30 నాటికి.. ఈ మ్యూచువల్​ ఫండ్​ ఏయూఎం రూ. 5,096కోట్లుగా ఉంది. 

ఎక్స్​పెన్స్​ రేషియో 1.90శాతంగా ఉంది. ఫైనాన్షియల్​, ఐటీ, కన్జ్యూమర్​ స్టేపుల్స్​ సెక్టార్​, ఎనర్జీ సెక్టార్​లో పెట్టుబడులు ఉన్నాయి. రూ. 500తో సిప్​ లేదా లమ్​సమ్​ ఇన్​వెస్ట్​మెంట్​ చేయవచ్చు.

ఈ ఫ్రాన్​క్లిన్​ ఇండియా ట్యాక్స్​షీల్డ్​ ఫండ్.. ఏడాదిలో 13.37శాతం, రెండేళ్లల్లో 13.98శాతం, మూడేళ్లల్లో 22.77శాతం రిటర్నులు ఇచ్చింది.

ఐడీఎఫ్​సీ ట్యాక్స్​ అడ్వాంటేజ్​ ఫండ్​..

IDFC Tax Advantage Fund returns : ఐసీఐసీఐ డైరక్ట్​ రికమెండ్​ చేస్తున్న మరో ఈఎల్​ఎస్​ఎస్​ మ్యూచువల్​ ఫండ్​.. ఈ ఐడీఎఫ్​సీ ట్యాక్స్​ అడ్వాంటేజ్​ ఫండ్​. క్రిసిల్​ నుంచి 5 స్టార్​, వాల్యూ రీసెర్చ్​ నుంచి 4 స్టార్​ రేటింగ్​ అందుకుంది ఇది. 

2008 డిసెంబర్​ 26న దీనిని లాంచ్​ చేశారు. 2022 నవంబర్​ 30 నాటికి ఈ ఫండ్​ ఏయూఎం రూ. 4,091కోట్లుగా ఉంది. ఎక్స్​పెన్స్​ రేషియో 0.75శాతంగా ఉంది. ఫైనాన్స్​, ఆటో, ఐటీ, మెటీరియల్​, ఆరోగ్య రంగాల స్టాక్స్​లో పెట్టుబుడులు ఎక్కువగా ఉన్నాయి. రూ. 500తో సిప్​ లేదా రూ. 1000తో లమ్​సమ్​లో ఇన్​వెస్ట్​మెంట్​ చేయవచ్చు.

ఈ ఐడీఎఫ్​సీ ట్యాక్స్​ అడ్వాంటేజ్​ ఫండ్​.. ఏడాదిలో 10.61శాతం, రెండేళ్లల్లో 15.14శాతం, మూడేళ్లల్లో 27.05శాతం రిటర్నులు ఇచ్చింది.

మిరే అసెట్​ ట్యాక్స్​ సేవర్​ ఫండ్​..

Mirae Asset Tax Saver funds 3 year returns : ఈ ఈఎల్​ఎస్​ఎస్​ మ్యూచువల్​ ఫండ్​కు క్రిసిల్​ నుంచి 3స్టార్​, వాల్యూ రీసెర్చ్​ నుంచి 5స్టార్​ రేటింగ్​ దక్కింది. 2016 డిసెంబర్​ 28న దీనిని ప్రారంభించారు. నిఫ్టీ500 టీఆర్​ఐని ఇది ట్రాక్​ చేస్తుంది. 

2022 నవంబర్​ 30 నాటికి దీని ఏయూఎం రూ. 14,255కోట్లు. ఎక్స్​పెన్స్​ రేషియో 0.55శాతంగా ఉంది. ఫైనాన్షియల్​, ఎనర్జీ, ఐటీ, ఆటో, హెల్త్​కేర్​లో పెట్టుబడులు ఉన్నాయి. రూ. 500తో సిప్​ లేదా రూ. 500తో లమ్​సమ్​ ఇన్​వెస్ట్​మెంట్​ చేయవచ్చు.

ఈ మిరే అసెట్​ ట్యాక్స్​ సేవర్​ ఫండ్.. ఏడాదిలో 7.18శాతం, రెండేళ్లల్లో 7.18శాతం, మూడేళ్లల్లో 20.45శాతం రిటర్నులు ఇచ్చింది.

టాటా ట్యాక్స్​ సేవింగ్స్​ ఫండ్​..

Tata Tax Savings Fund expense ratio : టాటా ట్యాక్స్​ సేవింగ్స్​ ఫండ్​ను 2014 అక్టోబర్​ 13న లాంచ్​ చేశారు. దీనికి క్రిసిల్​ నుంచి 3 స్టార్​, వాల్యూ రీసెర్చ్​ నుంచి 5 స్టార్​ రేటింగ్​ లభించింది. నిఫ్టీ500 టీఆర్​ఐని ఇది ట్రాక్​ చేస్తుంది. 

2022 నవంబర్​ 30 నాటికి ఈ ఫండ్​ ఏయూఎం రూ. 3,280కోట్లు. ఫైనాన్స్​, ఐటీ, ఎనర్జీ, ఎఫ్​ఎంసీజీ, హెల్త్​కేర్​ వంటి సెక్టార్​లలో పెట్టుబడులు ఉన్నాయి. ఎక్స్​పెన్స్​ రేషియో 0.75శాతంగా ఉంది. రూ. 500తో సిప్​ లేదా, రూ.500తో లమ్​సమ్​ ఇన్​వెస్ట్​మెంట్​ చేయవచ్చు.

ఈ టాటా ట్యాక్స్​ సేవింగ్స్​ ఫండ్​.. ఏడాదిలో 13.26శాతం, రెండేళ్లల్లో 13.92శాతం, మూడేళ్లల్లో 21.11శాతం రిటర్నులు ఇచ్చింది.

* పైన చెప్పిన ఓపెన్​ ఎండెడ్​ ట్యాక్స్​ సేవింగ్​ ఫండ్స్​లో రిస్క్​ ఎక్కువగా ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top