మనకు విరిగా దొరికే కూరగాయాల్లో టమాటా ఒక్కటి. కొన్ని సందర్భాల్లో ఈ టమాటాలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. అందుకే మనం టమాటాలు ఎక్కువగా వాడతాం.
దాదాపు ప్రతి వంటలో టమాటా వేస్తాం. చివరికి చికెన్ కర్రీలో కూడా టమాటా వేస్తాం. ఈ టమాటాలో చాలా పోషకాలు ఉంటాయి. దీనిలో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే సులువుగా బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.
విటమిన్ సి
పుల్లగా ఉండే టమాటాలు కూరకు మంచి రుచి ఇవ్వడమే కాదు.. రంగుని కూడా ఇస్తాయి. ఇవి క్యాన్సర్ సహా చాలా రకాల రోగాలను అడ్డుకొని, ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి మనం టమాటాలను తప్పక కూరల్లో వాడుతాం.
టమాటాల్లో విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. టమాటాలో ఉండే ప్రోస్టేట్ క్యాన్సర్ ను నిరోధిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
కెరోటిన్
టమాటాలో ఉండే బీటా కెరోటిన్ తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చట.
బీటా కెరోటిన్ అధికంగా ఉండే ఆహారాలు ప్రోస్టేట్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేస్తాయని పలు సర్వేలు సూచిస్తున్నాయి.టమాటాల్లో ఉండే పీచు, పొటాషియం, విటమిన్ సి, కోలిన్ అన్నీ గుండెను ఆరోగ్యంగా ఉపయోగపడతాయట. దీనిలో ఉండే పొటాషియం సోడియం తీసుకోవడాన్ని తగ్గిస్తుందట.
ఫోలేట్
టమోటాల్లో ఫోలేట్ కూడా ఉంటుంది. ఇది హోమోసిస్టీన్ స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. హోమోసిస్టీన్ అనేది ప్రోటీన్ విచ్ఛిన్నం వల్ల కలిగే అమైనో ఆమ్లం.
ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోలేట్ తో హోమోసిస్టీన్ స్థాయిలను నియంత్రించడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
హైడ్రేట్
టమాటాలు తినడం వల్ల బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. వీటిని తినడం వల్ల ప్రేగు కదలికలు మెరుగ్గా మారుతాయి. టమాటాల్లో లైకోపీన్, లుటిన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇంటి కంటి సమస్యలను తగ్గిస్తాయి.
కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. టమాటాల్లో ఉండే కెరోటినాయిడ్లు లుటిన్ ,జియాక్సంతిన్ కంటికి సంబంధిత సమస్యల తగ్గిస్తాయి.
0 Comments:
Post a Comment