Time : ఓ 20 ఏళ్ల కిందట డిజిటల్ వాచీలు ఉండేవి.
వాటిలో ముల్లుల బదులు టైమ్ డిజిటల్ నంబర్ల రూపంలో కనిపించేది. ఇప్పటికీ అవి ఉన్నా.. మొబైల్స్ రాకతో.. వాచీల వాడకం బాగా తగ్గిపోయింది. డిజిటల్ వాచీలలో 11 గంటల 11 సెకండ్లు అయినప్పుడు టైమ్ 11:11 గా కనిపించేది.
ఇప్పుడు మొబైల్స్‌లోనూ అలా కనిపిస్తోంది. ఈ టైమ్ రోజుకు 2 సార్లు కనిపిస్తుంది. కొన్ని దేశాల్లో ఆచారాల ప్రకారం 11:11 అనేది సాధారణ సమయం .
మీరు మీ వాచీలో అనుకోకుండా టైమ్ చూసుకున్నప్పుడు మీకు 11:11 అని కనిపించిందా? మీకు ఆ విషయం గుర్తుందా? ఎప్పుడైనా అది చూశారా? మీరు చూసినట్లయితే.. ఈ విషయం మీరు తెలుసుకోవచ్చు. ఆ ప్రత్యేక సమయం రహస్యం మీకు తెలియాలి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఎవరైనా తమ వాచీలో 11:11ని చూస్తే.. ప్రపంచం వారికి ప్రత్యేకంగా ఏదో చెప్పాలనుకుంటోందని అర్థం. జ్యోతిష్యాన్ని విశ్వసించే వారు ఈ విషయాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు.
గణితశాస్త్రం ప్రకారం 11:11 అనేది గడియార సమయం. అందులో అన్ని అంకెలు ఒకేలా ఉంటాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ క్షణం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి 11:11 గంటలకు గడియారాన్ని అనుకోకుండా చూస్తే.. వారిలో ఉత్సాహం పెరుగుతుంది.
11:11ని చూసిన వాళ్ల జీవితంలో ఒక కొత్త తలుపు తెరచుకుంటుంది. ఆ దారిలో వెళ్లేందుకు మార్గనిర్దేశం చేయమని దేవుడిని ప్రార్థించాలని జ్యోతిష నిపుణులు చెబుతారు.
అలా ప్రార్థించిన వారికి నిరాశ కలగదని అంటారు. మీరు ఈ టైమ్‌ని చూసి ఉంటే.. భవిష్యత్తులో మరిన్ని చోట్ల దీన్ని చూస్తారు. లేదా ఇలాంటి ఒకే అంకెలున్న వాటిని చూస్తారు.
ప్రాచీన నాగరికతకు చెందిన మయన్ల క్యాలెండర్ ప్రకారం... ఈ కాలపు అన్ని అంకెలూ సమానంగా ఉంటాయి. అందువల్ల ప్రజలందరూ ఈ సమయం కాగానే కొత్తవి ఏవైనా ప్రారంభించేవారు.
కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ నంబర్ని చూసినట్లయితే.. మీ జీవితంలో కూడా కొత్తది ఏదో జరగబోతోందని మీకు గ్రహించవచ్చు. అది ఏంటనేది మీరు అంతర్లీనంగా గ్రహించాలి. మీ మనసును అడగాలి.
అనంతవిశ్వంతో మీరు కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మీకు ఆ సందేశం ఏంటో తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment