భారతదేశంలో హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అలా గురువారం రోజున సాయిబాబాను పూజిస్తూ ఉంటాడు. అంతేకాకుండా గురువారంని విష్ణువు, దేవతలైన బృహస్పతికి అంకితం చేశారు.
గురువారం రోజున పసుపును దానం చేసి పసుపు బట్టలను ధరించడం మంచిది. గురువారాల్లో పసుపుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
ఈ పసుపు విషయాలలో, శనగపప్పు తినడం,దానం చేయడం కూడా చాలా ముఖ్యమైనది.గురువారం విష్ణువుకు పసుపు వస్తువులను సమర్పించి భక్తుల కోరికలను తీరుస్తాడు.
ఇంట్లో ఐశ్వర్యం, శ్రేయస్సు లేక అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే ఇంటికి దక్షిణం లేదా పడమర వైపు ఉన్న ఇంటిలో ఏదైనా మూలను గంగాజలంతో శుభ్రం చేసి అక్కడ స్వస్తిక్ గుర్తును వేయాలి.
అనంతరం అక్కడ చెంబులో శనగలు బెల్లం కలిపిన నీటిని పెట్టాలి. ఈ విధంగా ఐదు గురువారాలు చేయడం వల్ల ఇంట్లో ఆశీర్వాదంతో పాటు సంపదకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.
అదేవిధంగా ఎవరైనా వివాహం కాని వారు వివాహానికి సంబంధాలు చూస్తున్న సెట్ కాని వారు ఎర్రటి ఆవుకు శెనగపిండి కొద్దిగా బెల్లం కలిపి తినిపించాలి.
ఈ విధంగా 11 గురువారాలు చేయడం వల్ల గోమాత ఆశీస్సులు లభించి త్వరలోనే పెళ్లి నిశ్చయం అవుతుంది.
గురువారం రోజున శనగపప్పుతో తయారు చేసిన పదార్థాలు తినడం లేదంటే శనగలను దానం చేయడం వల్ల మంచి చేకూరడంతో పాటు డబ్బు వచ్చే మార్గాలు పెరిగే చేతికంతాల్సిన డబ్బు అందుతుంది.
గురువారం రోజున బాబాను కూడా భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి.
0 Comments:
Post a Comment