ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలి పేర గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్..
నేటి కాలంలో 70 నుంచి 80 ఏళ్ల వరకు బ్రతికారంటేనే చాలా పెద్దవిషయం ఇక తొంభై అంటే చాలా తక్కువ., మరీ 115 అంటే పెద్ద మాటే..
ఇప్పటి ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణం 50 సంవత్సరాల తర్వాత ఏదో ఒక సమస్యతో బాధపడటం మొదలవుతుంది.
అయితే ఈ రోజు మనం 100 ఏళ్లు దాటి 115 ఏళ్లు నిండి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR)లో తన పేరును చేర్చిన మహిళ గురించి చెప్పుకోబోతున్నాం.
ఈ మహిళ 115 సంవత్సరాల వయస్సులో జీవించి ఉన్న ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు. మరియా బ్రన్యాస్ మోరీరా అనే ఈమహిళ మార్చి 1907లో జన్మించింది.
ఈమె అమెరికాలో, స్పెయిన్‌లో ఉంటోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ఇలా ఉంది.. "19 జనవరి 2023 నాటికి శ్రీమతి మోరీరాకు 115 సంవత్సరాల 321 రోజులు.
మరియా బ్రన్యాస్ మోరీరా (USA/స్పెయిన్) ఇప్పుడు 118 మంది మరణించిన తర్వాత జీవించి ఉన్న అతి పెద్ద మహిళగా ,ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా నిర్ధారించబడింది.
తన దీర్ఘాయువు రహస్యాన్ని పంచుకుంటూ మరియా.. "క్రమం తప్పని ఆహారం, శాంతి, కుటుంబం, స్నేహితులతో మంచి సంబంధం, ప్రకృతితో పరిచయం, భావోద్వేగ స్థిరత్వం, చిన్న విషయాలకే చింతించకపోవడం, విచారం పడకపోవడం, చాలా సానుకూలత, విషపూరిత వ్యక్తుల నుండి దూరంగా ఉండటం. ఇవి ఆయురారోగ్యాలను పెంచుతాయి.
0 Comments:
Post a Comment