Teenage Mothers : శృంగారానికి స్వేచ్ఛ ఇచ్చింది. అగ్రరాజ్యం ఇప్పుడు తలలు పట్టుకుంటున్నది
Teenage Mothers : చిత్రం సినిమా చూశారా.. అందులో రీమాసేన్ పెళ్లి కాకుండానే తల్లవుతుంది. అప్పట్లో ఈ సినిమా యూత్ కు నచ్చినప్పటికీ… పెద్దలకు ఎందుకో కనెక్ట్ కాలేకపోయింది.
ఎందుకంటే శృంగారాన్ని ఇప్పటికీ మన సమాజం ఒక చాటు వ్యవహారం లాగానే చూస్తుంది కనుక.. కానీ ఇదే అమెరికాలో అలా ఉండదు.. అక్కడ స్వేచ్ఛ అపరిమితంగా ఉంటుంది కాబట్టి ఎవరు ఏమైనా చేసుకోవచ్చు.. టీనేజ్ పిల్లలకు అక్కడ ప్రత్యేక హక్కులు ఉంటాయి. కనీసం వారిని వాళ్ళ తల్లిదండ్రులు కూడా మందలించేందుకు అవకాశం ఉండదు. ఇదే సమయంలో శృంగారానికి సంబంధించి ఎవరూ అడ్డు చెప్పరు. ఫలితంగా అక్కడి యువత డేటింగ్ పై ఎక్కువ ఆసక్తి చూపుతోంది.
పెళ్లి కాకుండానే
అగ్రరాజ్యం అమెరికా ప్రపంచానికి సుద్ధులు చెబుతూ ఉంటుంది. కానీ తన కింద ఉన్న మరకలను మాత్రం చూసుకోదు. ప్రస్తుతం ఆ మరకలే ప్రపంచం ముందు అమెరికాను తల దించుకునేలా చేస్తున్నాయి. ఇందుకు కారణం అక్కడ విచ్చలవిడి శృంగారానికి అనుమతి ఇవ్వడమే. ఫలితంగా యుక్త వయసు పిల్లలు పెళ్లికాకుండానే తల్లులవుతున్నారు.. ఆ పిల్లలను తీసుకుని స్కూళ్ళకు లోకి వెళ్తున్నారు. ఈ పరిణామం కోవిడ్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో అగ్రరాజ్యం తలలు పట్టుకుంటున్నది.
పసికందుల ఏడుపులు
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం బ్రౌన్స్ విల్లే నగరంలో లింకన్ పార్క్ అనే పాఠశాల ఉంది. అక్కడ విద్యార్థుల అల్లరి తో పాటు పసికందుల ఏడుపులు కూడా వినిపిస్తాయి. ఎందుకంటే ఆ తరగతి గదుల్లో విద్యార్థులు మాత్రమే కాదు… వారు జన్మనిచ్చిన పిల్లలు కూడా ఉంటారు.. వారంతా పెద్దవారేం కాదు. కేవలం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు. వాస్తవానికి అమెరికాలో కావాల్సినంత శృంగార స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు అదే ఆ దేశం పరువును మంటగలుపుతున్నది. వాస్తవం అమెరికా దేశంలో యుక్త వయసు గర్భధారణ పై ఎప్పటినుంచో చర్చ జరుగుతున్నది. కానీ దానిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు దాదాపు శూన్యం.. ఒక టెక్సాస్ రాష్ట్రంలోనే సుమారు 300 మంది పదో తరగతి అమ్మాయిలు తల్లులయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడచిన మూడు దశాబ్దాల కాలంలో టీనేజ్ గర్భవతులు విపరీతంగా పెరిగిపోయారు.. అలాంటివారికి లింకన్ పార్క్ స్కూల్ సేవలందిస్తోంది.. ఇక ఈ పాఠశాలలో ఉన్న విద్యార్థులు మొత్తం 14 నుంచి 19 సంవత్సరాలు ఉన్నవారు.. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ ప్రకారం 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి పేజీ మంది విద్యార్థుల్లో 15 శాతం మంది 2020 సంవత్సరంలో ఓ బిడ్డకు జన్మ ఇచ్చారు.
సాధారణమైంది
అమెరికాలో టీనేజ్లో గర్భం దాల్చడం అనేది సర్వసాధారణం అయిపోయింది.. కొన్ని నగరాల్లో అయితే 15 సంవత్సరాల లోపు ఉన్న యువతులు కూడా గర్భం దాల్చుతున్నారు. ఇక బ్రౌన్స్ విల్లే లో ప్రతి పదిమంది టీనేజర్లలో ఒకరు బిడ్డకు జన్మనిచ్చారని తెలుస్తోంది. చిన్నతనంలోనే గర్భం దాల్చితే ఆ అమ్మాయిల ఆరోగ్యపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒక్కసారి తల్లయిన మహిళ మళ్లీ పటుత్వాన్ని సాధించడం దాదాపు అసాధ్యం.. తమ శరీరమే పూర్తిగా ఎదగని వారు… మరో బిడ్డకు జన్మనిస్తే కాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన పడతారని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.. మానసికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెబుతున్నారు. తెలిసి తెలియనివయసులో బిడ్డ భవిష్యత్తును భుజానికి వేసుకోవడం అంత ఆషామాషి వ్యవహారం కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రజల నుంచి డిమాండ్ల వ్యక్తం అవుతున్న నేపథ్యంలో… అగ్రరాజ్యం తలలు పట్టుకుంటున్నది. వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నది.
0 Comments:
Post a Comment