బ్రేకింగ్: తారకరత్న ఆరోగ్యస్థితిపై నారాయణ డాక్టర్స్ లేటెస్ట్ బులెటిన్!
నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. టీడీపీ యువనేత నారా లోకేష్ కుప్పంలో ప్రారంభించిన యువగళం పాదయాత్ర జరుగుతున్న సమయంలో తారకరత్న గుండెపోటుకు గురయ్యారు.
పరిస్థితి సీరియస్ గా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం తారకరత్నని కుప్పం నుండి బెంగళూరుకు తరలించారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్న ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆయన్ని కాపాడేందుకు వైద్యులు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ.. అంతా బాగానే ఉందని, ప్రెజెంట్ తారకరత్న ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని ఫ్యామిలీ మెంబర్స్ మీడియా ముందు చెప్పుకొచ్చారు. అలాగే ఆసుపత్రి వైద్యులు సైతం శనివారం హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తూ.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారు తెలిపారు. అనంతరం నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ బాలకృష్ణ, తారక్, కళ్యాణ్ రామ్.. చంద్రబాబు.. ఇలా కుటుంబ సభ్యులతో పాటు భారీ ఎత్తున నందమూరి అభిమానులు నారాయణ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్యం పట్ల అందరూ ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని ఆదివారం వార్తలు బయటికి వచ్చాయి. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా తారకరత్న హెల్త్ గురించి పాజిటివ్ గా మాట్లాడారు. దీంతో ఫ్యాన్స్ అంతా అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా డాక్టర్స్ మరో బులెటిన్ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. నారాయణ హాస్పిటల్ సిబ్బంది స్పందిస్తూ.. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నాం. అతనికి ఇంకా ఎలాంటి ఎక్మో సపోర్ట్ పెట్టలేదు’ అని తెలిపినట్లు సమాచారం.
0 Comments:
Post a Comment