Tamilnadu: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం స్టాలిన్ న్యూ ఇయర్ కానుక!
నూతన సంవత్సరం(new year)లోకి అడుగుపెట్టిన వేళ ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు సీఎం స్టాలిన్(Stalin) గుడ్‌న్యూస్ చెప్పారు.
ఉపాధ్యాయులతో పాటు పెన్షనర్లకు కరవు భత్యాన్ని(Dearness Allowance) పెంచుతూ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 34శాతంగా ఉన్న డీఏను 38శాతానికి పెంచిన సీఎం.. ఈ నిర్ణయం ఈరోజు (జనవరి 1) నుంచే అమలులోకి వస్తుందని స్పష్టంచేశారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు 16లక్షల మందికి లబ్ధి చేకూరనుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ డీఏ పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు.
డీఏ పెంపుతో ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2359 కోట్లు అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ డీఏ పెంపును ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్‌గా అభివర్ణించిన స్టాలిన్.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కృషిచేస్తున్న తమ ప్రభుత్వానికి ఉద్యోగులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, సమాన పనికి సమాన వేతనం కోరుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆందోళనల అంశంపైనా సీఎం స్పందించారు. ఈ అంశంపై రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఆ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
0 Comments:
Post a Comment