Swami Vivekananda: నేషనల్ యూత్ డే (National youth day) సందర్భంగా.. యువతకు స్ఫూర్తినిచ్చే వివేకానంద జీవిత పాఠాలు మీ కోసం..
భారతదేశంలోని గొప్ప ఆధ్యాత్మిక వేత్తలలో స్వామి వివేకానంద (Swami vivekananda) ఒకరు. ఆయన తన రచనలు, ఉపన్యాసాల ద్వారా ప్రాచీన భారత సంస్కృతిని ప్రపంచానికి తెలియజేశారు. యువతలో చైతన్యం నింపడానికి, వారిని దేశాభివృద్ధిలో భాగం చేయడానికి కృషి చేశారు.
భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆయన తొలి నుంచీ బలంగా విశ్వసించారు. 1983లో ప్రపంచ సర్వమత సార్వత్రిక సమ్మేళనంలో దేశ ఆధ్యాత్మిక విలువలను చాటిచెప్పారు.
వివేకానందుడు 1863 జనవరి 12న కోల్కత్తాలో జన్మించారు. ఆయన యువతలో ప్రేరణ కలిగించేందుకు చేసిన కృషికి గుర్తుగా వివేకానందుడి జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించాలని 1984లో ప్రభుత్వం ప్రకటించింది.
అప్పటి నుంచి ఏటా జనవరి 12న నేషనల్ యూత్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆయన అందించిన పాఠాల నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం.
* 'రోజుకు ఒకసారి మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే మీరు ఈ ప్రపంచంలో ఒక తెలివైన వ్యక్తిని కలిసే అవకాశం కోల్పోతారు'
మీరు మీ జీవితంలో ఏమి చేసినా అది మీకు అంతర్గత శాంతిని కలిగిస్తుంది. స్వీయ-ఆత్మ పరిశీలన దానిని సాధించడంలో సహాయపడుతుంది. జీవితంలో మీరు నిజంగా ఏమి కోరుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి మీతో మీరు మాట్లాడటం అవసరం. మిమ్మల్ని మీరు సరైన మార్గంలో నడిపించుకోవటానికి, మీ అంతరంగిక కోరికలను అర్థం చేసుకోవడానికి ఇది సమయం.
* 'మీరు ఎప్పుడైనా దేనికైనా భయపడితే, ఎల్లప్పుడూ ఎదురుతిరిగి, దాన్ని ఎదుర్కోండి. పారిపోవడం గురించి ఎప్పుడూ ఆలోచించవద్దు'
జీవితంలో మంచి రోజులు, చెడు రోజులు సర్వసాధారణం. మీ జీవితాన్ని సంపూర్ణంగా జీవించడానికి, మీ మార్గంలో ఎదురయ్యే కఠిన పరిస్థితులను ఎదుర్కోవాలి. వీటి నుంచి పారిపోతే మీ జీవితాన్ని పశ్చాత్తాపంతో నిండిపోతుంది. మీ భయాలను ధైర్యంగా ఎదుర్కోవడం, ప్రపంచంలో గొప్ప మార్పును తీసుకు వస్తుంది.
* 'మిమ్మల్ని మీరు నమ్మండి. ప్రపంచం మీ పాదాల వద్ద ఉంటుంది'
ప్రతి వ్యక్తిలోనూ శక్తి, సామర్థ్యాలు ఉంటాయి. ప్రజలు దీనిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇతరుల అభిప్రాయాల ముందు మోకాళ్లను వంచకూడదు. మీపై మీకు నమ్మకం ఉన్నంత వరకు, మీ లక్ష్యాలను సాధించకుండా ఏదీ ఆపలేదు.
* 'మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోవడం లేదంటే- మీరు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నారని అర్థం'
మనం ఎదగడానికి కష్టపడాలి. గొంగళి పురుగు కూడా సీతాకోకచిలుక గా మారడానికి చాలా కష్టపడుతుంది. అదే విధంగా మనం జీవితంలో సమస్యలను ఎదుర్కోవడం మానేసే రోజు మన ఎదుగుదల ఆగిపోతుంది.
* 'లేవండి, మేల్కొండి, లక్ష్యం చేరే వరకు విశ్రమించకండి'
జీవిత ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని అధిగమించడానికి పట్టుదల అవసరం. ఏదైనా పనిని పట్టుదలతో ప్రారంభిస్తే.. వైఫల్యం ఎదురయ్యే అవకాశం లేదు. అంతిమంగా విజయం సొంతం అవుతుంది.
* 'ఆత్మకు లింగం లేదు, ఇది మగ లేదా ఆడ కాదు. లింగం అనేది శరీరంలో మాత్రమే ఉంటుంది. ఆత్మను చేరుకోవాలని భావించే వ్యక్తి లింగ భేదాలను కలిగి ఉండలేడు'
సర్వోన్నత శక్తి మానవులందరినీ సమానంగా చేసింది. అతని సృష్టిగా, వివక్షను పాటించే హక్కు మనకు లేదు. అది మతం, కులం లేదా లింగం ఆధారంగా అయినా, ఈ భేదాలు మనం సృష్టించినవే. మనతోనే వాటిని ముగించవచ్చు.
* 'మీరు లోపల నుంచి బయటికి ఎదగాలి. ఎవరూ మీకు బోధించలేరు, ఎవరూ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మార్చలేరు. మీ సొంత ఆత్మ తప్ప మరొక గురువు లేడు'
మీరు కోరుకుంటే తప్ప ఈ ప్రపంచంలోని ఏ బయటి శక్తీ మిమ్మల్ని మార్చడంలో సహాయపడదు. ఇది ప్రపంచంలోని వ్యక్తులందరికీ వర్తిస్తుంది. మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే తప్ప వారికి సహాయం చేయలేరు.
నిజమైన పురోగతి లోపలి నుంచి వస్తుంది.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)
0 Comments:
Post a Comment