స్కూల్ కాంపౌండ్లో నిరసన చేపట్టినందుకు తెనాలిలో ఐదుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్.
వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఐతానగర్లో ఎన్ఎస్ఎఫ్ పురపాలక ఉన్నత పాఠశాలలో ఇటీవల విద్యార్థులు వారి తల్లితండ్రులు తమ సమస్యలు పరిష్కరించాలని స్కూల్ కాంపౌండ్లో నిరసన చేపట్టారు. ఇదే అంశంపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. డీఈవో శైలజ నేతృత్వంలో విచారణ చేపట్టారు. పేరెంట్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్తోపాటూ.. ఆ ప్రాంత కౌన్సిలర్ పాఠశాల నిర్వహణ విషయంలో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని విద్యాశాఖ అధికారుల పరిశీలనలో వెల్లడైంది.
పాఠశాల నిర్వహణలో చోటు చేసుకునే లోటుపాట్లను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు వారికి చేరవేస్తూ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని తేలింది. పాఠశాల పనివేళల్లో పీఎంసి చైర్మన్ అక్కడే ఉంటున్నారని ఆ ప్రాంత కౌన్సిలర్ అక్కడే జిమ్ ఏర్పాటు చేసుకొని నిత్యం వ్యాయామం చేస్తున్నాడని తేలింది. అక్కడ జరుగుతున్న ఘటనలు పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు డీఈఓ గుర్తించారు. పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే, ఉపాధ్యాయులు తమ దృష్టికి ఎందుకు తీసుకు రాలేదని డీఈఓ ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు ఉపాధ్యాయులపై డీఈఓ శైలజ సస్పెండ్ వేటు వేశారు.
0 Comments:
Post a Comment