✍️ఇద్దరు హెచ్ఎంల సస్పెన్షన్
*🌻భీమవరం ఎడ్యుకేషన్/ పాలకొల్లు, జనవరి 20:* జిల్లాలో ఇద్దరు హెచ్ఎంలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ డీఈవో ఆర్.వెంకటరమణ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. భీమవరం మండలం గూట్లపాడు ఎంపీపీ స్కూల్ మెయిన్ ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయురాలు బి. శివనాగజ్యోతి సహ ఉపాధ్యాయు లను దూషించడం, దురుసుగా ప్రవర్తిస్తూ కులం పేరుతో విమర్శించడం, కుల ప్రాతిపదికన గ్రామస్థులను వేరు చేయడానికి ప్రయత్నించడం, ఆమె ప్రవర్తనా తీరుపై వచ్చిన అభియోగాలపై కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 19వ తేదీ నుంచి విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపారు.
పాలకొల్లు బీఆర్ఎంవీఎం హైస్కూల్ హెచ్ఎం ఎస్.ఝాన్సీ లక్ష్మీభాయిని కూడా సస్పెండ్ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్నా భోజన పథకానికి వినియోగించే బియ్యం ముక్కిపోయి, పురుగులు పట్టిన బియ్యంతో వండి వడ్డన చేస్తున్నారని విద్యాకమిటీ ఆరోపణలు చేసింది. ఇదే అంశంపై ఈనెల 6న 'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన కథనంపై డీఈవో ఆదేశాల మేరకు భోజన పథకం జిల్లా కో ఆర్డినేటర్ కె.కృష్ణారావు బృందం తనిఖీలు చేసి నివేదిక అందించారు. అవసరమైన బియ్యం నిల్వ ఉన్నప్పటికీ ఇండెంట్ తగ్గించకుండా దిగుమతి చేసుకోవడంతో 200 బస్తాల బియ్యం నిల్వ ఉందని ఇది తన తప్పిదమని హెచ్ఎం అంగీకరించడంతో సస్పెండ్ చేసినట్టు తెలిపారు.
0 Comments:
Post a Comment