మీరు పంచదారను ఎక్కువగా తీసుకుంటున్నారా? చక్కెర అధికంగా ఉండే స్వీట్లు తినకుండా ఉండలేకపోతున్నారా?
అయితే మీకో బ్యాడ్ న్యూస్. ఆ అధిక చక్కెర మీ ప్రాణాలను తీసేంత ప్రమాదకారి కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక మోతాదులో చక్కెర తీసుకుంటే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుందంటున్నారు.
సాధారణంగా అధికంగా ఉప్పు తింటే బీపీ పెరిగి కిడ్నీలు ఫెయిలవడం చూస్తూ ఉంటాం. అయితే అధికంగా షుగర్ తినడం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతింటున్నాయని ఇటీవల నిపుణులు గుర్తించారు.
పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్..
చక్కెర అతిగా తీసుకోవడం వల్ల పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్(PKD) వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఓ స్టడీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో దాదాపు 12 మిలియన్ల మందికి ఈ వ్యాధి శోకిందని చెబుతోంది. ఇది సోకితే నయం చేయడం కష్టమని, కిడ్నీ మార్పిడి చేయాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వ్యాధి వస్తే ఏమవుతుంది..
పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వ్యాధి వస్తే మూత్రపిండాల మీద తిత్తులు ఏర్పడతాయి. అవి కిడ్నీ స్వరూపాన్నే మార్చేస్తాయి. ద్రవంతో నిండిన ఈ తిత్తుల ఏర్పాటులో చక్కెర కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ తిత్తులు మూత్రపిండాల పనితీరుని దెబ్బతీసేంత పెద్దవిగా పెరుగుతాయి. చివరికి అవయవాలు విఫలమయ్యేలా చేస్తాయి. డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరం అవుతుంది.
మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండే చక్కెరస్థాయిలను మూత్ర పిండాలు అధిక మొత్తంలో తీసుకోవడం ద్వారా తిత్తులు ఉబ్బినట్లు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ మెడిసిన్ పరిశోధకులు గుర్తించారు.
మూత్రపిండాల్లో చక్కెర స్వీకరణ నిరోధించే మందుల్ని ఉపయోగించినప్పుడు దాని వాపుని అది తగ్గించిందని వివరించారు.
పరిశోధనలు ఇలా సాగుతున్నాయి..
ఈ నేపథ్యంలో అసలు మూత్రపిండాల్లోని ద్రవం PKDకి ఎలా దోహదపడుతుందనే దాని మీద పరిశోధకులు దృష్టి సారించారు. అందులో భాగంగా కిడ్నీ ఆర్గానోయిడ్ ని మైక్రోఫ్లూయిడ్ చిప్ తో కలిపే ఒక కొత్త సాధనాన్ని వాళ్ళు కనుగొన్నారు. ఇది నీరు, చక్కెర, అమైనో ఆమ్లాలు, ఇతర పోషకాల కలయికని పీకేడీ అనుకరించేలా చేశారు. దీని వల్ల తిత్తులు వాపు రావడానికి గల కారణాలు పరిశీలిస్తున్నారు.
ఈ లక్షణాలు కనిపిస్తే..
ఈ పీకేడీ జన్యుపరమైన వ్యాధి. దీనిని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే నయం చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఒకరికి వచ్చిందంటే మిగతా వారికి కూడా వచ్చే అవకాశం ఉంది.
పీకేడీ సోకిన వ్యక్తులు కాలేయం వ్యాధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తరచుగా మూత్ర విసర్జన, పొత్తికడుపు నొప్పి, మూత్రంలో రక్తం పడటం, తీవ్రమైన వెన్నునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించి తగిన వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చక్కెర తక్కువ తీసుకుంటేనే మేలు..
అధికంగా చక్కెరతో చేసిన ఆహారం త్వరగా జీర్ణం కాదు. ఫలితంగా పొట్టలో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అధిక చక్కెర శరీరంలో చేరితే కొవ్వు రూపంలోకి మారుతుంది.
దీని వల్ల బరువు పెరుగుతారు. బరువు ఎక్కువగా ఉండటం వల్ల మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
0 Comments:
Post a Comment