Sleep: ప్రతి మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే. సరైన నిద్ర లేకపోతే అనారోగ్యమే. దీంతో నిద్ర పోవడానికి సమయం కేటాయించుకోవాలి. రోజుకు కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్ర పోతేనే మన ఆరోగ్యం బాగుంటుంది.
మనకు నిద్ర సరిపోయిందో లేదో తెలుసుకోవాలంటే కొన్ని ట్రిక్కులు పాటిస్తే తెలిసిపోతోంది. నిద్ర సరిగా పోతేనే మనకు లాభం ఉంటుంది.
అందుకే మనకు సరైన నిద్ర పడుతోందా? మనం కంటి నిండా పోతున్నామా అనే విషయాలు తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
Sleep
రోజు ఉదయం అలారం మోగితే కానీ మెలకువ రాకపోవడమంటే మనకు నిద్ర సరిపోవడం లేదని తెలుసుకోవాలి. రోజు మనం లేచే సమయానికి మెలకువ వస్తే మంచి నిద్ర పోయినట్లే భావించాలి.
సెలవు దినాల్లో పగటిపూట నిద్రపోతున్నారా? మిగతా రోజుల్లో సరిగా నిద్రపోవడం లేదనే అనుకోవాలి.
కోల్పోయిన నిద్రను భర్తీ చేసుకునే ప్రయత్నంలో శరీరం వెసులుబాటు ఉన్నప్పుడు పగటిపూట ఎక్కువ సేపు విశ్రాంతిని కోరుకుంటుంది. మనం సరిగా నిద్ర పోకపోవడానికి మన జీవనశైలే ప్రధాన కారణం.
రోజుకు కనీసం 30 నిమిషాలైనా నడక, వ్యాయామం వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. టీవీ చూస్తున్నప్పుడు కునుకుపాట్లు తీస్తున్నారా? అయితే మీకు నిద్ర సరిపోనట్లే లెక్క. మెలకువగా ఉన్న సమయంలో నిద్ర వస్తోందంటే నిద్ర సరిపోవడం లేదని అర్థం.
సరైన నిద్ర పోవాలంటే రోజు ఒకే సమయానికి పడుకోవడం, లేవడం చేయాలి. రాత్రి ఆలస్యంగా పడుకుంటే తెల్లవారి ఎక్కువ సేపు పడుకోవడం మంచి పద్ధతి కాదు. వీలైతే మధ్యాహ్నం కాసేపు కునుకు తీయొచ్చు. ఇలా కచ్చితమైన పద్ధతులు పాటిస్తే సరైన నిద్ర రావడం సహజమే.
నిద్ర పోయే గదిలో మసక చీకటి ఉండేలా చూసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే ముందు ఇంట్లో వెలుతురు లేకుండా జాగ్రత్త పడాలి. నిద్రపోయే ముందు సెల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్ టాప్ లు ఆపేయాలి.
పడుకోబోయే ముందు కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పుకోవాలి. పడక గది సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రపోయే రెండు గంటల ముందే భోజనం ముగించాలి.
పడుకోవడానికి రెండు గంటల ముందు టీ, కాఫీ, మద్యం తాగకూడదు. సాయంత్రం వ్యాయామం చేయాలి. గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే కమ్మటి నిద్ర మన సొంతమవుతుంది.
Sleep
నిద్ర పట్టకపోతే చక్కని సంగీతం వినాలి. లేదా మంచి పుస్తకం చదువుకోవాలి. నిద్ర వస్తున్నప్పుడు మాత్రమే మంచం మీదికి వెళ్లాలి. స్నానం చేసే నీటిలో ఒక కప్పు రోజ్ వాటర్ వేసుకుని స్నానం చేస్తే మంచిది.
పడుకోబోయే ముందు ఇలా జాగ్రత్తలు తీసుకుంటే మంచి నిద్ర మన వశం అవడం ఖాయం. ఒత్తిడి దూరమవుతుంది. ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటించి మంచి నిద్ర పోయేందుకు చక్కని పరిస్థితులు కల్పించుకోవాలి.
0 Comments:
Post a Comment