Skin Fungal Infection: ఫంగల్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఇలా 2 రోజుల్లో ఉపశమనం పొందొచ్చా?
Skin Fungal Infection: చలి కాలంలో చాలా మందిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. తేమ కారణంగా చర్మంపై దురద, పొక్కులు, ఎర్రబడడం వంటి సమస్యలు మొదలవుతాయి.
కొన్నిసార్లు గోళ్ల దగ్గర ఉబ్బి పొక్కుల్లా వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలు వస్తే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చర్మం అందహీనంగా కూడా తయారవుతుంది. కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సమస్యలు ఉన్నవారు పలు రకాల హోం రెమెడీస్స్ను వినియోగించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వీటితో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మటు మాయం:
టీ ట్రీ ఆయిల్:
టీ ట్రీ ఆయిల్లో ఉండే ఔషధ గుణాలు ఫంగల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసేందుకు సహాయపడతాయి. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి చర్మం, గోళ్ల ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు తప్పకుండా టీ ట్రీ ఆయిల్ చర్మానికి అప్ల చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది.
అలోవెరా జెల్:
కలబందలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ లక్షణాలు ఫంగల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా దురద, మంటల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే ప్రభావిత ప్రాంతాల్లో ఈ జెల్‌ను రోజుకు 2-3 సార్లు పూయడం వల్ల ఫలితం తొందరలోనే పొందుతారు.
వేప ఆకులు:
వేప ఆకులు కూడా చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ను నయం చేసేందుకు సహాయపడుతుంది. అయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడేవారు ప్రతి రోజూ వేప ఆకులను ఉడకబెట్టి ఆ నీటితో ప్రభావితమైన వ్యాధి ప్రదేశంలో శుభ్రం చేయాల్సి ఉంటుంది.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దూరం చేసేందుకు సహాయపడుతుంది. అయితే చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ కొబ్బరి నూనెను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత 1 గంట తర్వాత నూనెను శుభ్రం చేయాలి.
0 Comments:
Post a Comment