HM ,MEO లకు షోకాజ్ నోటీసులు
ఆగరిపల్లి, ముసు నూరు మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్‌ను శుక్ర వారం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
హెచ్‌ఎం, ఎంఈవోలకు షోకాజ్ నోటీసులు
అధికారులపై అగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రవీణ్ ప్రకాశ్
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ తనిఖీలు
ఆగిరిపల్లి /ముసునూరు, జనవరి 27: ఆగరిపల్లి, ముసు నూరు మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్‌ను శుక్ర వారం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అడవి నెక్కలం జడ్పీ పాఠశాల, ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం మోహనకృష్ణ, ఎంఈవో పి.రత్నకుమార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఈవో మధుసూదనరావును ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలలో 1,2 తరగ తులు మాత్రమే నిర్వహిస్తుండగా కేవలం 11 మంది విద్యార్థులకు ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులను ఎందుకు ఉంచారని ఎంఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసి దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. పాఠ శాలలో రెండో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు సెమ్–1 పాఠ్యాంశాలు బోధించడాన్ని గమనిం చిన ఆయన గతంలోనే పూర్తి చేయాల్సిన సిలబస్ ఇప్పుడు ఎందుకు చెబు తున్నారని మండిపడ్డారు. అనంతరం మండల పరిధిలోని వట్టిగుడిపాడు ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేశారు.
విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం
విద్యార్థులకు నాణ్యమైన బోధన లేకే చిన్న, చిన్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారని అధికారుల పని తీరుపై ప్రవీణ్ ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసునూరు సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం టెన్త్ విద్యార్థులను ఆయన పలు ప్రశ్నలడగగా వారు సమాధానలు చెప్పలేకపోయారు. దీంతో విద్యాశాఖ ఆర్జేడీ, ఏలూరు జిల్లా ఇన్‌చార్జ్ విద్యా శాఖా ధికారి మధుసూదనరావు, డీవైఈవో శేవ్యానాయక్, ఎంఈవో రత్నకుమార్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పనితీరు వల్ల విద్యార్థుల భవిష్యత్ దెబ్బతింటుందని, వారంలో ఒకసారి పాఠ శాలలను ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు.
0 Comments:
Post a Comment